వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల గొంతు మారుతోంది: కెసిఆర్ పసి గడ్తారా, లేదా?

బంగారు తెలంగాణ సాధనే తమ ధ్యేయం అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ట్రేడ్ మార్క్ రాజకీయ వ్యూహం. ఆ పేరిట సబ్బండ వర్ణాల ప్రజలను తన వైపునకు మళ్లించుకోవాలన్నది ఆయన అభిమతం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధనే తమ ధ్యేయం అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ట్రేడ్ మార్క్ రాజకీయ వ్యూహం. ఆ పేరిట సబ్బండ వర్ణాల ప్రజలను తన వైపునకు మళ్లించుకోవాలన్నది ఆయన అభిమతం.

కానీ సామాన్యులు.. అందునా కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే ధిక్కార స్వరానికి మారుపేరైన తెలంగాణ ప్రజలంతా తమ అభిమతాన్ని విస్మరించి... స్వార్థమే పరమావధిగా వ్యవహరించే అధినేతలను విస్మరిస్తారని, మాయ మాటలతోనే కబుర్లు చెప్పేవారికి తగిన రీతిలో సమాధానం చెప్తారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

2006 కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితంతో పోలిస్తే 2008 ఉప ఎన్నిక నాటికి మెజారిటీ తగ్గిపోవడమే నిదర్శనం.
తాజాగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ పరిధిలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణకు ప్రభుత్వం అణచివేత వ్యూహంపై రైతుల నిరసన కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నది. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు సేకరించే భూసేకరణ కింద పొలాలకు ఏ విధంగా పరిహారం చెల్లించాలన్నది నిర్ణయిస్తూ చట్టాలు రూపొందించాయి. కానీ ఆ చట్టాల అమలుకు మాత్రం పాలకులు ముందుకు రావడం లేదు.

మరో మార్గంలో కోదండరాంకు ఇలా ఆహ్వానం

మరో మార్గంలో కోదండరాంకు ఇలా ఆహ్వానం

దానికి నిరసనగా కొండ పోచమ్మ రిజర్వాయర్ పరిధిలోని బైలంపూర్ గ్రామస్తులు వాస్తవాలను తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ దశలో పోలీసులు అడ్డుకోకుండా మరో మార్గంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులను మరో మార్గంలో రప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గం పట్టారు. ఇదే రైతుల ధోరణిలో వచ్చిన మార్పును తెలియజేస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Recommended Video

CM KCR Review Meeting On Tollywood Drug Scandal - Oneindia Telugu
పాలమూరు - రంగారెడ్డి మినహా అన్ని ఎక్కడి గొంగడి అక్కడే

పాలమూరు - రంగారెడ్డి మినహా అన్ని ఎక్కడి గొంగడి అక్కడే

మూడేళ్ల క్రితం తెలంగాణ ఆవిర్భావం తర్వాత క్రుష్ణా నది జలాలపై ఆశలు పెట్టుకోకుండా గోదావరి, దాని ఉప నదులపై ప్రాజెక్టుల నిర్మాణమే తమ లక్ష్యమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘంటాపథంగా చెప్పారు. అంతటితో ఆగక అసెంబ్లీ సాక్షిగా ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్' చేశారు. దానిపై విపక్షాలను ఆత్మ రక్షణలో పడేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆచరణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జూరాల, కల్వకుర్తి, బీమా కోయిల్ సాగర్ తదితర ఎత్తిపోతల పథకాలు.. ఇవన్నీ కూడా 2002 తర్వాత క్రమక్రమంగా మొదలైన పథకాలే.. దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంటున్న దశలో తెలంగాణ ఆవిర్భావమైంది. అవి మినహా మిగతా ప్రాజెక్టులేవీ గణనీయ స్థాయిలో నిర్మాణ దశకు చేరుకోనే లేదు.

ప్రభుత్వ హయాంలోనే డిజైన్

ప్రభుత్వ హయాంలోనే డిజైన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోనే డిజైన్ రూపొందించబడిన ‘డిండి' ప్రాజెక్టుకు మళ్లీ డిజైన్ మార్చేసి ఇటీవలే టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు మాత్రమే ఉన్న తరుణంలో కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఘంటాపథంగా చెప్పారు సీఎం కేసీఆర్.. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు. సాక్షాత్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానం పరిధిలో కొండ పోచమ్మ జలాశయం నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది.

2016 భూ సేకరణ చట్టంలో కీలకాంశాల తొలగింపు

2016 భూ సేకరణ చట్టంలో కీలకాంశాల తొలగింపు

ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం పరిధిలో ఉన్నది. గోదావరి నది జలాలపై కాళేశ్వరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్.. దానికి అనుబంధంగా కొండ పొచమ్మ జలాశయం నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దీని కిందకు ములుగు మండలం బైలంపూర్‌, మామిడ్యాల, తానేదార్‌పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల ప్రజలను బెదిరింపుల ద్వారా ‘అధికార దండం' మాటున బలవంతపు భూసేకరణకు శ్రీకారం చుట్టింది. కొండ పోచమ్మ ప్రాజెక్టు పరిధిలో బలవంతపు భూసేకరణను అడ్డుకునేందుకు రైతులు, ప్రజలు నిరసన చెబుతున్న తరుణంలో రాజకీయ ఐక్యకార్యచరణ సమితి చైర్మన్ ఎం కోదండరాం, హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి బైలంపూర్ గ్రామానికి వచ్చారు. వీరు వస్తున్న సంగతి తెలుసుకున్న పోలీసులు గ్రామ పొలిమెరల్లో అన్ని వైపులా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంగతి తెలుసుకున్న గ్రామస్థులు ఎవరికి తెలియకుండా వారిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. మామిడ్యాల మీదుగా బైలంపూర్‌ వరకు ఉన్న మట్టి రోడ్డు మీదుగా వారిని గ్రామానికి తీసుకొచ్చారు.

రైతులను మభ్య పెట్టొదన్న జేఏసీ చైర్మన్

రైతులను మభ్య పెట్టొదన్న జేఏసీ చైర్మన్

కొదండరాం తదితరులు వచ్చేసరికే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. గ్రామానికి వచ్చిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, న్యాయవాది రచనారెడ్డి నేరుగా రైతులతో మాట్లాడారు. రైతులు తమ గ్రామంలో పోలీసులు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, తమ ఇబ్బందులూ ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని వివరించారు. తమ భూములను ఏ చట్టం ప్రకారం తీసుకుంటున్నారో కూడా తమకు తెలియజేయడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం భూములు తీసుకుంటుందో ముందుగానే గ్రామ సభలు నిర్వహించి ప్రజలందరికీ ఆ చట్టం గురించి పూర్తిగా అవగాహన కల్పించాకే తీసుకోవాలన్నారు. ఇలాంటివేం చేయకుండా ప్రజలను మోసం చేయడం సరైంది కాదని రైతులకు కోదండరాం, రచనారెడ్డి రైతులకు వివరించారు. 2013 భూ సేకరణ చట్టం గురించి రైతులకు వారు సవివరంగా తెలియజేశారు. ప్రజలకు అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తామని మభ్యపెట్టి భూములను తీసుకోవడం ప్రభుత్వానికి తగదని అన్నారు.

అధికార బలంతో అణచివేతకు యత్నం

అధికార బలంతో అణచివేతకు యత్నం

కోదండరాం గ్రామానికి వచ్చిన సంగతి తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో బైలంపూర్ గ్రామంలోకి తరలివచ్చారు. ప్రధాన రహదారుల వద్ద బందోబస్తును ఏర్పాటుచేసినా వీరు ఎలా వచ్చారంటూ ఆరా తీశారు. కానీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం అనుసరిస్తున్న తీరు.. భూముల స్వాధీనం కోసం తమను బెదిరిస్తున్న తీరుపై విసుగెత్తిన రైతులు నిరసన బాట పట్టారు. వారి నిరసనను బహిర్గతం కాకుండా.. అణచివేయడానికి.. విపక్ష నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అన్ని వసతులు కల్పించినందుకు పోలీసులు సర్వ విధాల పాలకుల విధానాలకు బద్ధులై శాంతిభద్రతల పరిరక్షణ పేరిట సర్కార్ ఆదేశాలు అమలు చేస్తున్నారు. కానీ ఈ సంగతి తెలిసిన ప్రజలు, సామాన్య రైతులు క్రమంగా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. తమ సమస్యలకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.

గ్రామస్తుల తిరుగుబాటు సవాళ్లు

గ్రామస్తుల తిరుగుబాటు సవాళ్లు

బైలంపూర్ తదితర గ్రామ రైతులకు వాస్తవాలు తెలియజెప్పేందుకు వస్తున్న కోదండరాంను అడ్డుకోకుండా.. మరో మార్గంలో వారిని తమ గ్రామానికి సాదరంగా తీసుకెళ్లడంలోనే ప్రభుత్వ దమనకాండ పట్ల ప్రజల వ్యతిరేకత అవగతమవుతోంది. బైలంపూర్ గ్రామపంచాయతీ వద్ద ప్రజలతో మాట్లాడి పక్కనే ఉన్న ఓ రైతు ఇంట్లో ఛాయ్‌ తాగేందుకు వెళ్లిన కోదండరాం, రచనారెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమ ఇంటికి అతిథిగా వచ్చినవారిని నిర్బంధించడమేమిటని ఆ ఇల్లాలు పోలీసులతో వాగ్వాదానికి దిగింది. వీరు ఎలా వచ్చారో అలానే పంపాలని, అరెస్టు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఆ ఇంట్లో నుంచి వారు బయటకు రాగానే పోలీసులు గ్రామంలో పోలీస్‌ సెక్షన్‌ 30 అమలులో ఉందని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా పోలీస్‌ వాహనికి అడ్డు తగిలారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలకు ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో పోలీసులు ఇద్దరిని వారి సొంత వాహనాల్లోకి ఎక్కించారు. వీరిని అరెస్టు చేయడం లేదని, ఇక్కడి నుంచి పంపుతున్నామని చెప్పడంతో గ్రామస్థులు అడ్డు తొలిగారు. బందోబస్తు నడుమ వారి వాహనాలను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు.

రాజీవ్ రహదారిపై కోదండరాం అరెస్ట్

రాజీవ్ రహదారిపై కోదండరాం అరెస్ట్

పోలీసుల వాహనాల వెంట కొంతమంది బైలంపూర్ యువకులు, గ్రామస్థులు రావడంతో వారిని మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. రాజీవ్‌ రహదారి గౌరారం వద్దకు రాగానే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయపోల్‌ మండలం బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు కోదండరాంను, గౌరారం పోలీస్‌ స్టేషన్‌కు రచనరెడ్డిని తరలించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో నిరసన దీక్ష చేపడతామని కోదండరాం హెచ్చరించడంతో ఆయన్ను వదిలి పెట్టారు. గమ్మత్తేమిటంటే కొండపోచమ్మ ప్రాజెక్టు కింద భూ నిర్వాసితులను భూమి సేకరణ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులకు బెదిరింపులకు దిగారు. మూడు రోజుల డెడ్‌లైన్‌ విధిస్తున్నామని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల కోసం పెట్టిన క్యాంపును ఎత్తివేస్తామని హెచ్చరించారు.

బెదిరింపుల ద్వారా భూ స్వాధీన యత్నం

బెదిరింపుల ద్వారా భూ స్వాధీన యత్నం

భూములు ఇవ్వక పోతే బలవంతంగా నైనా తీసుకుని రైతుల ఖాతాలో డబ్బు జమచేస్తామని రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని రైతులకు సర్కారు జారీ చేసిన అల్టిమేటం ఇది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్ధిపేట జిల్లా మర్కుట్‌ మండలంలో నిర్మించ తలపెట్టిన కొండపోచమ్మసాగర్‌ కోసం చేస్తున్న భూసేకరణ ప్రక్రియలో అడుగడుగునా బెదిరింపుల పర్వం కొనసాగుతున్నదని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌ ధరను సవరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్వస్తి చెప్పి గుండు గుత్తగా తాము నిర్ణయించిన ధరకే భూములను ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నది. ఇటీవల అమల్లోకి తెచ్చిన 2016 భూసేకరణ సవరణ చట్టంతో సామాజిక ప్రభావ అంచనా, ఆహారభద్రత వంటి అంశాలను తొలగించడంతో రైతులకు ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా కాలరాసిన ప్రభుత్వం దళారులను, టీఆర్‌ఎస్‌ నేతలను, పోలీసులను రంగంలోకి దింపి రైతులపై ఒత్తిడి పెంచుతున్నది.

తెర వెనుక రాజకీయం ఇలా

తెర వెనుక రాజకీయం ఇలా

రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించతలపెట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ కింద ములుగు మండలం మామిడ్యాల, బైలంపూర్‌, తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండా గ్రామాల్లోని ఐదువేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. భూసేకరణ కోసం నోటిఫికేషన్లు జారీ చేయకుండానే భూముల కొనుగోళ్లు ప్రారంభించటం పట్ల రైతులు అభ్యంతరం చెప్పారు. తమతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా అది óకారులు భూములను కొనుగోలు చేయడం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముందుగా కొందరు టీఆర్‌ఎస్‌ నేతలను రంగంలోకి దింపి స్థానికంగా ఉన్న ఫాంహౌస్‌లకు పిలిపించి తమకు అనుకూలమైన కొందరు రైతులతో మంతనాలు కొనసాగించారని రైతులు తెలిపారు. అతి తక్కువ సమయంలో భూసేకరణ పూర్తి చేస్తామని, నాలుగు గ్రామాలను సాధ్యమైనంత త్వరగా ఖాళీ చేయిస్తామని సీఎంకు కొందరు స్థానిక నేతలు, అధికారులు హామీ ఇచ్చారని వారు ఆరోపించారు. మూడు పంటలు పండే భూమికి కూడా ఎకరానికి 12 లక్షలిస్తామంటే కొందరు రైతులు రహస్యంగా గజ్వేల్‌ వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేయించారని మామిడ్యాల రైతులు తెలిపారు. ఇటీవల ఆ ప్రాంతంలో కొందరు రైతులు ఎకరానికి 20 లక్షల రూపాయలు చెల్లించి భూములు కొనుగోలు చేశారని, ప్రధాన రహదారి వద్ద ఎకరానికి 45 లక్షలకు కూడా పలుకుతున్నదని కొందరు రైతులు వివరించారు. ప్రభుత్వం కేవలం రూ. 12 లక్షలిస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. భూములను ఇవ్వాలా వద్దా అని చర్చించుకోవడానికి తాము సమావేశాలు పెట్టుకుంటే వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బైలంపూర్‌ రైతులు తెలిపారు.

హెచ్చరికల పేరిట కట్టడికి విఫలయత్నం

హెచ్చరికల పేరిట కట్టడికి విఫలయత్నం

రైతులతో మాట్లాడటానికి ఎవరైనా రైతు సంఘం నేతలు కానీ, మీడియా కానీ వస్తే పోలీసులు బెదిరిస్తున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని నాలుగు గ్రామాల రైతులు చెప్పారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ను రూ. 762.60 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఈ నెల 14 వ తేదీన జీఓ విడుదల చేసింది. పాలనాపరమైన అనుమతులు రాకముందే అంతకు ముందే భూముల రిజిస్ట్రేషన్‌ చేయడాన్ని కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. భూముల అత్యవరసర రిజిస్ట్రేషన్‌ కోసం గజ్వేల్‌లో ఒక ప్రత్యేక క్యాంపును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్యాంపు ఉన్నంత వరకే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే తామేం ఏమీ చేయలేమని, తర్వాత బలవంతంగా భూములు తీసుకుని పరిహారం బ్యాంకులోని ఖాతాల్లో జమ చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

English summary
Telangana people has understand realities of government statements and policies while they realise of the government voice of state government slogan 'Bangaru Telangana'. General people particularly farmers were ready to declare thier dessent on government in different routes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X