కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా.. అడుగడుగునా నీరాజనం.. కేటీఆర్ కు ఘన స్వాగతం

|
Google Oneindia TeluguNews

Recommended Video

KTR Received Grand Welcome From Hyderabad To Karimnagar | Oneindia Telugu

హైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతా తానై వ్యవహరిస్తూ పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. గులాబీ దండుకు కలిసొస్తున్న కరీంనగర్ వేదికగా తొలి సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుమార్గాన హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరిన కేటీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.

లోక్‌సభ సమరశంఖం.. కరీంనగర్ సెంటిమెంట్ గా తొలి సమావేశం.. కేటీఆర్ మార్క్లోక్‌సభ సమరశంఖం.. కరీంనగర్ సెంటిమెంట్ గా తొలి సమావేశం.. కేటీఆర్ మార్క్

కేటీఆర్ కు ఘన స్వాగతం

కేటీఆర్ కు ఘన స్వాగతం

టీఆర్ఎస్ పార్లమెంటరీ స్థాయి తొలి సన్నాహాక సమావేశాలకు కరీంనగర్ వేదికైంది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు రహదారి మొత్తం గులాబీమయంగా మారింది. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమైన సమయంలో.. 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందులోభాగంగా సన్నాహాక సదస్సులు తలపెట్టారు. కరీంనగర్ లో జరుగుతున్న తొలి సదస్సుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా పార్టీశ్రేణులు నీరాజనాలు పలికారు. బాణసంచా కాల్చుతూ, డప్పులు కొడుతూ తమ అభిమానం చాటుకున్నారు.

గులాబీమయం

శామీర్ పేట చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించారు కేటీఆర్. అక్కడినుంచి కరీంనగర్ కు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఆయన వెంబడి కార్లు, ద్విచక్రవాహనాలతో పార్టీశ్రేణులు పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. రాజీవ్ జాతీయ రహదారి మొత్తం గులాబీమయంగా మారింది. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాలుపంచుకున్నారు.

ఎంపీ ఎన్నికల వేడి.. బీజేపీ స్ట్రాటజీ షురూ.. ఇవాళ నిజామాబాద్ కు అమిత్ షాఎంపీ ఎన్నికల వేడి.. బీజేపీ స్ట్రాటజీ షురూ.. ఇవాళ నిజామాబాద్ కు అమిత్ షా

ఆట పాట.. కలర్ ఫుల్ గా సభాస్థలి

కరీంనగర్ లోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సన్నాహాక సదస్సు కార్యక్రమం మొదలైంది. కళాకారులు ఆట పాటలతో అలరిస్తున్నారు. సింగర్ సాయిచంద్ తన మాటపాటలతో సభికులను ఆకట్టుకుంటున్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి 3వేల మందికి పైగా రానుండటంతో.. సభా ప్రాంగణంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి వేర్వేరుగా సీటింగ్ ఏర్పాటు చేశారు. 25వేల మందికి సరిపడా భోజనాలు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. గులాబీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు.. ఇలా కేటీఆర్ కు స్వాగతం పలకడానికి కరీంనగర్ మొత్తం గులాబీమయంగా మారింది. టీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు చాలామంది ఇప్పటికే సభాస్థలికి చేరుకున్నారు.

English summary
The TRS Loksabha electoral responsibility taken party working president KTR. Everything is going to be directed to the party cadre. In that order, the parliamentary constituency meetings organized. The first session is in the Karimnagar parliamentary constituency. Grand welcome received KTR from hyderabad to karim nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X