వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహేష్ బాబు బాకీ వసూలు, ఆయన స్టే తెచ్చుకోలేకపోయారు అందుకే ఇలా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు నటుడు మహేష్ బాబు చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని వసూలు చేశామని జీఎస్టీ కమిషనరేట్ తెలిపింది. మొత్తం రూ.73 లక్షలు మహేష్ బాబు కట్టవలసి ఉండగా, గురువారం రూ.42 లక్షలను రికవరీ చేశామని తెలిపారు.

ట్రెజరీ బ్యాంకుకు జమ

ట్రెజరీ బ్యాంకుకు జమ

తాజాగా, ఆయన ఖాతాల్లో నుంచి రూ. 31.47 లక్షలను ప్రభుత్వ ఖజానాకు జమ చేశామన్నారు. దీనిని డీడీ రూపంలో ట్రెజరీ బ్యాంకుకు జమ చేశామని జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. దీంతో మహేష్ బాబు చెల్లించాల్సిన మొత్తం పన్ను జమ అయిందన్నారు. ఈ కేసులో మహేష్ బాబు చేసుకున్న అపీళ్లను రెండు అథారిటీలు తిరస్కరించాయని చెప్పారు. దీంతో పన్ను మొత్తాన్ని కట్టాలని ఆదేశించాయని తెలిపారు.

స్టే తెచ్చుకోవడంలో విఫలమయ్యారు

స్టే తెచ్చుకోవడంలో విఫలమయ్యారు

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో హైకోర్టును ఆశ్రయించి మహేష్ బాబు స్టే తెచ్చుకోవడంలో విఫలమయ్యారని జీఎస్టీ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. అందువల్లే తాము చర్యలకు దిగామని అధికారులు చెప్పారు. 2010లోనే తాము ఆయనకు నోటీసులు ఇచ్చామని, కానీ స్పందించలేదని, స్పందించని కారణంగానే ఖాతాలను సీజ్ చేసి, ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు చేశామన్నారు.

అందుకే చర్యలకు దిగాల్సి వచ్చింది

అందుకే చర్యలకు దిగాల్సి వచ్చింది

సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఇప్పటి వరకు కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని, అందుకే తాము చర్యలకు దిగవలసి వచ్చిందని జీఎస్టీ వర్గాలు తెలిపాయి. వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించే ప్రకటనల సర్వీసులు కూడా బిజినెస్‌ ఆక్సిలరీ సర్వీసెస్‌ కింద పన్ను చెల్లింపు కిందకు వస్తాయని చట్టం చెబుతోందని అన్నారు.

ఏం జరిగిందంటే?

ఏం జరిగిందంటే?

ఇటీవల మహేష్ బాబుకు హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ జలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2007-08 సంవత్సరానికి గాను మహేష్ బాబు సేవా పన్ను కట్టనందున ఆయన బ్యాంక్ అకౌంట్లు అటాచ్ చేస్తున్నట్లు జీఎస్టీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమయంలో మహేష్ బాబు పలు సంస్థలను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారని ప్రకటనలో తెలిపారు. దీనిపై వచ్చిన ఆదాయంపై మహేష్ బాబు సర్వీస్ ట్యాక్స్ కట్టలేదన్నారు. 2005లో మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ప్రారంభించారు. జీఎస్టీ కమిషనర్ లీగల్ నోటీసులపై మహేష్ బాబు స్పందించారు. తాను ఎలాంటి పన్నులు కట్టకుండా ఎగ్గొట్టలేదన్నారు. తను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినని చెప్పారు. పన్నులన్నీ సక్రమంగా కట్టినట్లు స్పష్టం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న తన బ్యాంకు అకౌంట్లను కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా స్తంభింపజేస్తారన్నారు.

English summary
Tollywood superstar Mahesh Babu’s bank accounts were frozen by the Central Board of Direct Taxes authorities for not paying GST related to brand endorsements during the year 2007-2008.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X