హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందకృష్ణను చంచల్‌గూడ జైల్లో పరామర్శించిన జిగ్నేష్ మేవానీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుమతి లేకుండా నిరసనకు దిగి అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ బుదవారం నాడు కలిశారు. జైలులో ఉన్న మందకృష్ణను మేవానీ జైలులో కలిశారు. సుమారు గంటపాటు మందకృష్ణతో మేవానీ చర్చించారు.

ఎబిసిడిల వర్గీకరణ కోసం ఆందోళన చేసే విషయంలో ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు.ఈ కేసులో మందకృష్ణ మాదిగ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

Gujarat MLA Mevani meets Manda Krishna Madiga in chanchalguda jail

ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో జిగ్నేష్ మేవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దళితుల తరపున మేవానీ ఉద్యమం నిర్వహించారు.జిగ్నేష్ వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాలు పెద్దఎత్తున జైలు వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.

ఎబిసిడి వర్గీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మందకృష్ణ ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టారని అరెస్ట్ చేశారు.

English summary
Gujarat MLA Jignesh Mevani met MRPS founder president Mandakrishna Madiga in chanchalguda jail on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X