వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ టార్గెట్: ఫన్నీ లెక్క, అమిత్ షాకు మంచు లక్ష్మి దిమ్మతిరిగే ఝలక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమిత్ షాకు మంచు లక్ష్మి దిమ్మతిరిగే ఝలక్

హైదరాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 150 సీట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ 99 సీట్లకే పరిమితం అయింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ 80 సీట్లు గెలుచుకుంది. గుజరాత్‌లో బీజేపీ గెలుపుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

గుజరాత్ ఫలితాలను చూసి ప్రధాని మోడీ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి స్పందించారు.

ఫౌండ్ దిస్ ఫన్నీ

ఫౌండ్ దిస్ ఫన్నీ

ఫౌండ్ దిస్ ఫన్నీ.. అంటూ 182 సీట్లున్న గుజరాత్‌లో అమిత్ షా 150 సీట్లను అడిగారని, గుజరాత్ ప్రజలు మొత్తం సీట్ల నుంచి 28 శాతం జీఎస్టీని తీసేసి 99 సీట్లు ఇచ్చారని మంచు లక్ష్మి తన ట్విట్టర్ అకౌంటులో పేర్కొన్నారు.

150లో 28 శాతం జీఎస్టీ తీసేస్తే

150లో 28 శాతం జీఎస్టీ తీసేస్తే

అమిత్ షా అడిగిన 150లో 28 శాతం జీఎస్టీని తీసి వేస్తే మిగిలేది 99 అని, ఆ సీట్లు బీజేపీకి గుజరాత్‌లో వచ్చాయని మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్ చేశారు.

180 సీట్లకు 51 సీట్ల జీఎస్టీ

180 సీట్లకు 51 సీట్ల జీఎస్టీ

182లో 28 శాతం జీఎస్టీ అంటే 51 అవుతుందని, బీజేపీ అడిగిన 150 సీట్లలో నుంచి 50 సీట్లను తీసివేసి మిగతా సీట్లు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ ట్వీటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, మోడీతో మంచు ఫ్యామిలీ గతంలో ఫోటోలు కూడా దిగారు. మంచు లక్మి ఆయనను ఫాలో అవుతుంటారు కూడా.

బీజేపీకి సీట్లు తగ్గుదల

బీజేపీకి సీట్లు తగ్గుదల

కాగా, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకొని, అత్తెసరు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకుర్ వంటి యువనేతలు మద్దతు పలకడం, రాహుల్ గాంధీ ఆలయాలను సందర్శించి హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేయడం, దానికి తోడు జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంతో బీజేపీకి ఆ సీట్లు తగ్గాయి.

English summary
'Amit shah asked for 150 seats out of 182 in Gujarat. Gujju people gave him 99 after deducting 28% GST.' Lakshmi Manchu tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X