వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌లోకి కోమటిరెడ్డి సోదరులు: గుత్తా షాకింగ్ కామెంట్స్

కోమటిరెడ్డి సోదరులపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం లేకుండా మాల్లాడుతున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్గొండ: కోమటిరెడ్డి సోదరులపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం లేకుండా మాల్లాడుతున్నారని సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

గుత్తాకు హైకోర్టు షాక్: పిటిషన్ ఉపసంహరణకు నోగుత్తాకు హైకోర్టు షాక్: పిటిషన్ ఉపసంహరణకు నో

గురువారం ఆయన నల్గొండలో విలేకరులతో మాట్లాడారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడుతూ మరోవైపు టీఆర్‌ఎస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ గురించి మాట్లాడే నైతిక హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదన్నారు.

Gutta sukhender reddy sensational comments on Komatireddy brothers
జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ కేటాయించే యోచనలో కేసీఆర్‌ ఉన్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. అయితే జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తోందనే ధీమాతోనే వెంకటరెడ్డి దొంగ దీక్షలకు సిద్ధమవుతున్నారని గుత్తా విమర్శించారు.

ఉత్తమ్‌ను తప్పించకపోతే ఎన్నికల్లో పోటీచేయను: కోమటిరెడ్డి సంచలనంఉత్తమ్‌ను తప్పించకపోతే ఎన్నికల్లో పోటీచేయను: కోమటిరెడ్డి సంచలనం

గురువారం నాడు ఉదయం నల్గొండలో మటన్ మార్కెట్ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ కార్యక్రమానికి ఎంపీ సుఖేందర్‌రెడ్డిని ఆహ్వనించలేదంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకొంది.

English summary
Nalgonda Mp Gutta Sukhender reddy sensational comments on Komatireddy brothers on Thursday at Nalgonda.Komatireddy brothers planning to join in Trs said Sukhender reddy .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X