హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దానం ఇస్తే రాజ్ భవన్, చార్మినార్‌లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? వక్ఫ్ బోర్డుపై హైకోర్టు సీరియస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా? లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్‌భవన్‌లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? అని వక్ఫ్ బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్ నామా కింద 1955లో భూమి ఇస్తే 2013 వరకు ఏం చేస్తున్నారని వక్ఫ్ బోర్డును నిలదీసింది. ఆ భూములపై యాజమాన్య హక్కులను పరిశీలించకుండా రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పుబట్టింది.

హఫీజ్ పేట భూములపై హైకోర్టులో..

హఫీజ్ పేట భూములపై హైకోర్టులో..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేటలోని సర్వే నెం. 80 భూములకు సంబంధించి 2014 నవంబర్ 1న ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆ భూములు తమవంటూ సాయిపవన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కె ప్రవీణ్ కుమార్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై మంగళవారం జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మసనం విచారణ చేపట్టింది.

ఆ భూములు తమవేనంటూ కోర్టుకు..

ఆ భూములు తమవేనంటూ కోర్టుకు..

పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 1955లో మున్నీరున్నీసా బేగం దానం కింద ఇచ్చిన ఈ భూములపై 2006లో ఫైనల్ డిక్రీ వచ్చిందని, హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టులో 2013 నవంబర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చాయన్నారు. అయితే, ఆ వెంటనే వక్ఫ్ బోర్డు సమావేశమై రిజిస్టర్ చేయించిందని తెలిపారు. 2014 నవంబర్ 1న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా పిటిషనర్లకు చెందిన భూములపై హక్కులు కోరుతూ స్వాధీనానికి ప్రయత్నిస్తోందని కోర్టుకు వివరించారు.

హఫీజ్‌పేట భూములన్నీ ప్రభుత్వానివే..

హఫీజ్‌పేట భూములన్నీ ప్రభుత్వానివే..

ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ హఫీజ్‌పేట భూములన్నీ ప్రభుత్వానివేనని తెలిపారు. ప్రభుత్వానికి చెందిన భూములను కొంత మంది ప్రైవేటు వ్యక్తులు భాగపరిష్కారం పేరుతో పంపిణీ చేసుకుంటే చెల్లుబాటు కాదని చెప్పారు. ఇది ప్రభుత్వ భూమిగా పహాణీలో ఉందని స్పష్టం చేశారు. ఇక ముతవల్లీ తరపు న్యాయవాది ఖురేషీ వాదనలు వినిపిస్తూ వక్ఫ్‌నామా ద్వారా ఆస్తులు వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు.

దానం ఇస్తే రిజిస్టర్ చేసుకుంటారా?: వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ప్రశ్న

దానం ఇస్తే రిజిస్టర్ చేసుకుంటారా?: వక్ఫ్ బోర్డుకు హైకోర్టు ప్రశ్న

ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. భూమిని ఇచ్చినప్పుడు మున్నీరున్నీసా బేగం ఆ భూమి ఎలా వచ్చిందో చెప్పలేదంది. అంతేగాక, ఈ భూములు హైకోర్టులో పెండింగ్ ఉన్న నిజాం ఆస్తులకు సంబంధించిన సీఎస్ 14 కేసులో భాగమని, అప్పుడు కూడా ఇందులో ప్రతివాదిగా ఆమె తాను 140 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు ఇచ్చినట్లు చెప్పలేదని పేర్కొంది.

ఆమె చనిపోయాక పత్రాలు సృష్టించినట్లుందని, కుమ్మక్కైనట్లుందని వ్యాఖ్యానించింది. భూమిని దానంగా ఇచ్చినప్పుడు పబ్లిక్ నోటీసు ఇచ్చి అభ్యంతరాలను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించింది. దానం ఇస్తే చార్మినార్, రాజ్‌భవన్‌లను కూడా రిజిస్టర్ చేసుకుంటారా? అని నిలదీసింది. వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కావాలని న్యాయవాది కోరగా.. నిరాకరిస్తూ బుధవారానికి వాయిదా వేసింది.

English summary
Hafeezpet land dispute: telangana High Court serious at Wakf board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X