• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అరగంట స్పీచ్.!ఆటమ్ బాంబ్ లాంటి మాటలు.!బీజేపికి వెయ్యేనుగుల బలాన్నిచ్చిన అమీత్ షా.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బీజేపి తుక్కుగూడ సభ తుక్కురేగిపోయింది. కదం తొక్కిన కాషాయ శ్రేణులకు ధీటుగా కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఉపన్యాసం కొనసాగడంతో ఆ పార్టీలో నూతన ఉత్సహం తొనికిసలాడుతోంది. బీజేపి నాయకుల ఉసన్యాసాలు ఒకరిని మించి ఒకరు అన్నట్టు సాగగా అమీత్ షా స్పీచ్ మాత్రం అంతకు మించి అన్నట్టు సాగింది. ఏ లక్ష్యంతో తెలంగాణ సిద్దించింది.?సిద్దించిన తెలంగాణ కలను సీఎం చంద్రశేఖర్ రావు సాకారం చేయగలిగారా.?బీజేపి వస్తే ఏం చేస్తుంది.?అనే అంశాలను సూటిగా సుత్తి లేకుండా అమీత్ షా వర్ణించిన తీరు కమల దండును కనువిందు చేసింది.

బండి సంజయ్ పాద యాత్ర ముగింపు సభ సక్సెస్..

బండి సంజయ్ పాద యాత్ర ముగింపు సభ సక్సెస్..

తెలంగాణ బీజేపిలో నూతన జవసత్తువలు నింపారు అమీత్ షా. బండి సంజయ్ మహా సంగ్రామ యాత్ర రెండవదశ ముగింపు సందర్బంగా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ముఖ్య అతిధిగా కేంద్రహోం మంత్రి అమీత్ షా హాజరచ్చారు. అనుకున్న సమయానికన్నా మూడు గంటలు ఆలస్యంగా వేదికమీదకు చేరుకున్న అమీత్ షా తన ఉపన్యాసంతో జోష్ నింపారు.

అమీత్ షా ఉపన్యాసం సాదాసీదాగా కొనసాగుతుందనుకున్న వారి అంచనాలను తలకిందులు చేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత పరిస్దితులను వివరించడమే కాకుండా అనేక వాగ్దానాలు చేసిన చంద్రశేఖర్ రావు విధానాలపై విమర్శనాస్త్రాలు సంధించడం కాషాయ శ్రేణులను ఉత్సాహపరిచింది.

ఇర్రగదీసిన అమీత్ షా..

ఇర్రగదీసిన అమీత్ షా..

మహా సంగ్రామ యాత్ర రెండవ దశ ముగింపు సభలో స్ధానిక నేతలు ఏం మాట్లాడతారు అనే అంశం కన్నా కేంద్ర హోం మంత్రి హోదాలో అమీత్ షా ఏం ప్రసంగిస్తారు అనే అంశంపై బీజేపి శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. నేతలందరూ మాట్లాడింది ఒక లెక్క అమీత్ షా మాట్లాడింది ఒక లెక్క అనే రీతిలో అమీత్ షా ఎవ్వరూ ఊహించని రీతులో ఘాటుగా ప్రసంగించారు. సభకు విచ్చేసిన సాధారణ కార్యకర్త ఏం అమీత్ షా నుండి ఏం కోరుకుంటాడో అవే అంశాలను కేంద్ర హోంమంత్రి వివరించి వేదిక కింద ఉన్న పార్టీ కార్యకర్తల్లో వంద సునామీల జోష్ ను నింపారు అమీత్ షా.

 మంత్రముగ్ధులను చేసి అమీత్ షా..

మంత్రముగ్ధులను చేసి అమీత్ షా..


టీఆర్ఎస్ పార్టీపైన, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపైన రొటీన్ గా చేసే రాజకీయ విమర్శలు కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి తెలంగాణ రాష్ట్రంకోసం ఏం చేసింది అనే అంశాలను వివరించారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖర్ రావు ప్రజలకు ఎలాంటి హామీలిచ్చారు.?అవి ఎంతవరకూ నెరవేర్చారు అనే అంశాలను వివరించిన విధానానికి బీజీపీ శ్రేణులు మంత్ర ముగ్దులయ్యారు. అమీత్ షా ప్రసంగం ప్రజల్లోకి వెళ్లడానికి గానీ, అమీత్ షా ఉపన్యాసాన్ని ఆసక్తిగా ఆలకించడానికి గానీ అవే అంశాలు బాగా దోహదపడ్డాయనే చర్చ జరుగుతోంది.

మరుగున పడ్డ అంశాలను గుర్తు చేసిన అమీత్ షా..

మరుగున పడ్డ అంశాలను గుర్తు చేసిన అమీత్ షా..

అంతే కాకుండా మరుగున పడ్డ చంద్రశేఖర్ రావు వాగ్దానాలను తెలంగాణ ప్రజలకు మరొక్కసారి గుర్తు చేసారు అమీత్ షా. తెలంగాణ విమోచన దినం, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, నీళ్లు,నిధులు, నియామకాలు, ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, రెండు గదుల ఇళ్లు వంటి వాగ్దానాలు ఎంతవరకూ నెరవేరాయో అమీత్ షా ఏకరువు పెట్టారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యమ సమయంలో ప్రజలు ఏం కావాలనుకుని ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారో ఆ లక్ష్యాలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు అమీత్ షా. దీంతో బీజేపి శ్రేణుల ఉత్సాహం కట్టలు తెంచుకుంది. అరంగంట పాటు కొనసాగిన అమీత్ షా ఉపన్యాసానికి కాషాయ కార్యకర్తలు బ్రహ్మరధం పట్టారు.

English summary
Union Home Minister Amit Shah's speech continues in the wake of the tumultuous Kashaya ranks. The speeches of the BJP leaders seemed to go beyond one another while Amit Shah's speech went beyond that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X