వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ దాడి -మందిరం పేరుతో చందాల దందాలన్న ధర్మారెడ్డి వ్యాఖ్యలతో..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో క్రమంగా బలపడుతోన్న బీజేపీ.. ఇప్పుడు ఏకంగా అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిదుల్ని ఫిజికల్ గానూ టార్గెట్ చేస్తోంది. అయోధ్యలో రామమందిరంపై అనూహ్య వ్యాఖ్యలు చేసినందుకుగానూ హన్మకొండలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి(పరకాల నియోజకవర్గం) ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి దిగారు. ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అయోధ్యలో రామ మందిరానికి విరాళాల సేకరణపై ధర్మారెడ్డి విమర్శలు చేయడం ఈ పరిణామానికి దారి తీసింది..

నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీనిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ

 బీజేపీ చందాల దందా..

బీజేపీ చందాల దందా..

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పేరుతో బీజేపీ నేతలు విచ్చలవిడిగా చందాలు వసూలు చేస్తున్నారని, రాముడి గుడి అంటూ బీజేపీ నేతలు సేకరిస్తోన్న విరాళాలకు అకౌంటబిలిటీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం పరకాలలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బీజేపీ, అయోధ్య ఆలయానికి విరాళాలపై ధర్మారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు...

పటేల్ విగ్రహం కట్టారు కదా..

పటేల్ విగ్రహం కట్టారు కదా..

''హిందువులంటే బీజేపీ పార్టీవాళ్లేనా? మేమూ హిందులమే. బీజేపీ.. దేవుని పేరుతో అకౌంటబులిటీ లేకుండా డబ్బులు వసూలు చేస్తోంది. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో లెక్కలు చెప్పగలరా? ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి కోట్లు వసూలు చేస్తే.. 29 రాష్ట్రాల్లో రూ. 29 వేలకోట్లు ఏం చేస్తారు? గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి వేలకోట్లు వెచ్చించిన బీజేపీ వాళ్లు.. ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడి గుడిని నిర్మించలేరా?'' అని ధర్మారెడ్డి వ్యాఖ్యానించగా బీజేపీ నేతలు ప్రతిదాడికి దిగారు..

 చల్లాకు కడియం పరామర్శ

చల్లాకు కడియం పరామర్శ

అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం కోసం నిధుల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు రాళ్లతో విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బీజేపీ కార్యకర్తలను పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం హన్మకొండలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెళ్లారు. బీజేపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వస్తువులను కడియం పరిశీలించారు. కొద్ది రోజుల కిందట టీఆర్ఎస్ కే చెందిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.. 'భద్రాద్రి రాముడికి కాకుండా అయోధ్య ఆలయానికి విరాళాలు ఇవ్వడమేంట'న్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

Recommended Video

#TOPNEWS: #Vizag విశాఖపట్నంలో మరో భారీ అగ్నిప్రమాదం | చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య !

జడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనాజడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనా

English summary
parakala trs mla dharma reddy house in hanamkonda has attacked by alleged bjp activists on sunday. mla recently criticises bjp for collecting irregular donations for ayodhya temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X