వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ బంద్ ప్రజావ్యతిరేకం: కేంద్రమంత్రి హన్సరాజ్‌, ఇబ్బందేనని సురవరం

దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేశారని కేంద్రహోంశాఖ సహాయ శాఖ మంత్రి హన్సరాజ్‌ గంగారాం అన్నారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేశారని కేంద్రహోంశాఖ సహాయ శాఖ మంత్రి హన్సరాజ్‌ గంగారాం అన్నారు. ప్రభుత్వం చేప్టిన ఈ చర్యకు వ్యతిరేకంగా సోమవారం విపక్షాలు చేపట్టిన భారత్‌బంద్‌ ప్రజా వ్యతిరేకమని ఆయన విమర్శించారు.

ఆదివారం రాత్రి వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చంద్రాపూర్‌ వెళ్లిన కేంద్రమంత్రి గంగారామ్‌ వీఐపి లాంజ్‌లో కొద్దిసేపు మీడియాతో మ్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో నల్ల ధనం, అవినీతితో దేశం భ్రష్టుపట్టిందని అన్నారు. అవినీతి రహిత పాలన కోసమే ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీకీ పట్టంకట్టారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నల్లధనాన్ని సమూలంగా నాశనం చేసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారని, ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు.

అవినీతిపరులకే ఆందోళన

పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఉన్న వారు భయపడుతున్నారే కానీ సామాన్యులు ఏమాత్రం ఆందోళన చెందడం లేదన్నారు. దేశంలో నగదు రహిత పాలనను తీసుకురావటం ద్వారా నల్ల ధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేప్టిందని, అందులో భాగంగానే దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్‌ అకౌంట్ ఉండాలని ప్రత్యేక కార్యక్రమాన్ని చేప్టి విజయం సాధించామన్నారు. నోట్ల రద్దును ప్రజలు హర్షిస్తుంటే విపక్షాలు మాత్రం రాద్ధాంతం చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయని అన్నారు.

hansraj gangaram ahir on Bharat bandh

విపక్షాల వాదనను ఎవరూ నమ్మడంలేదని, ప్రజలు ఈ బంద్‌లో పాల్గొనరనే విశ్వాసం తమకు ఉందని కేంద్రమంత్రి గంగారాం అన్నారు. ప్రజారంజక పాలనను సాగిస్తున్న తమ ప్రభుత్వాన్నే రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, భూపాలపల్లి జిల్లాల బీజేపీ అధ్యక్షులు రావుపద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, వి. పాపయ్య, సీనియర్‌ నాయకులు చందుపట్ల జంగారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతాకుల సునీల్‌, గందెనవీన్‌, సంతోష్‌రెడ్డి, నిశాంత్‌ పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు.

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకు తప్పని ఇబ్బందులు: సురవరం

కేంద్ర ప్రభుత్వం మతత్వాన్ని ప్రోత్సహిస్తూ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోందని, ఈ పరిణామాలు వామపక్ష పార్టీలు అడ్డుకొని దేశాన్ని కాపాడవలసిన అవసరం ఉందని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం రోజున సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలను హన్మకొండలోని హోటల్‌ హరిత కన్వెన్షన్‌ హాల్‌లో గంగసాని సత్యపాల్‌రెడ్డి నగర్‌లో ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి చిరువ్యాపారులకు, సామాన్య ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగించారని, ముందస్తు ప్రణాళిక లేకుండా నవంబర్‌ 8వ తేదీ రాత్రి ప్రకటించడం వల్ల నోట్ల కొరతతో ప్రజలు ఇప్పటికీ ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడ్డా ఫలితం లేకుండా పోయిందని, పేద ప్రజలు కూలీలకు వెళ్లకుండా ఈ నోట్ల ప్రభావం చూపిందని అన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నోట్ల రద్దుపై స్పందించలేదని, ఆయన వద్ద వేల కోట్ల విలువగల రూ. 1000, రూ. 500 నోట్లు ఉండటం వల్లనే ఆయన స్పందించడం లేదని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. వేల కోట్ల రూపాయలను పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యదేశంలో చాలా అపాయకరమని పేర్కొన్నారు. ఇటీవల ఆయన ప్రధాన మంత్రి దగ్గరికి వెళ్లి ఒప్పందం కుదుర్చుకొని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, డబుల్‌ బెడ్‌రూం పథకం మూలన పడిందని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో ఎన్నో అక్రమాలు జరిగాయని, వేల కోట్ల రూపాయలు వృథా అయ్యాయని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మహాసభల తర్వాత కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

అంతుకు ముందు సీపీఐ పార్టీ సీనియర్‌ నాయకుడు పార్టీ స్థూపాన్ని ఆవిష్కరించగా మరో పార్టీ సీనియర్‌ నాయకుడు మడత కాళీదాస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సీపీఐ పార్టీ కార్యదర్శి చాడ వెంక్‌రెడ్డితోపాటు అనేక మంది పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో 383 ప్రతినిధులతోపాటు రాష్ట్ర కార్యవర్గసభ్యులు, రాష్ట్ర సమితి సభ్యులు, 31 జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.

English summary
Union Minister Hansraj Gangaram Ahir responded on Bharat bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X