వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ భేష్: హరీష్‌తో నిపుణుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన(పీపీపీ) బాగుందని నీటిపారుదల రంగ నిపుణుడు హనుమంతరావు అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పంజాగుట్టలోని హనుమంతరావు ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.

రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులు, రీ డిజైనింగ్‌పై హరీష్ రావు హనుమంతరావుతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రాజెక్టుల రూపకల్పనపై హరీశ్‌రావు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను మెచ్చుకున్నారు.

భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, అసెంబ్లీలో ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన(పీపీపీ) బాగుందని వ్యాఖ్యానించారు. కాగా, రివర్సబుల్‌ పంపులు వాడితే జలవిద్యుదుత్పత్తి చేసుకోవచ్చని హనుమంతరావు చేసిన సూచనను కూడా పరిగణనలోకి తీసుకుంటామని హరీశ్‌రావు చెప్పారు.

గోదావరి పరీవాహక ప్రాంతంలో నౌకాయానం

గోదావరి పరీవాహక ప్రాంతంలో నౌకాయానం

గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో నౌకాయానాన్ని దృష్టిలో పెట్టుకొని లాక్‌ల నిర్మాణం చేయాలంటూ చేసిన సూచనపైనా దృష్టిపెడతామని హరీష్ రావు చెప్పారు.

చర్చిస్తున్నామని హరీష్ రావు

చర్చిస్తున్నామని హరీష్ రావు

నౌకాయానశాఖ అనుమతి, నిధుల కేటాయింపు కోసం కేంద్రంతో సంప్రదిస్తామని హరీష్ చెప్పారు. మిషన్ కాకతీయలో చెరువుల ఎత్తు మరింత పెంచాలని చేసిన సూచనను కూడా అమలు చేస్తామన్నారు.

సూచనలు భేష్

సూచనలు భేష్

విశ్రాంత అధికారి అయినా నిత్య విద్యార్థిలా సాగునీటి ప్రాజెక్టులపై పరిశోధనలు చేస్తున్న హనుమంతరావు సూచనలు ఎంతో కీలకమని హరీష్ రావు ప్రశంసించారు.

మెచ్చుకున్నారు...

మెచ్చుకున్నారు...

కరువు నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హనుమంతరావు ప్రశంసించారని హరీష్ రావు చెప్పారు.

ఇలా చేస్తాం...

ఇలా చేస్తాం...

మేడిగడ్డ నుంచి ఎస్సారెస్పీ వరకు వరుస ప్రాజెక్టులను నిర్మించి వాటి ద్వారా నిల్వ ఉండే నీటితో అటు సాగుకు ఇటు విద్యుత్‌ ఉత్పాదన జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు హరీష్ రావు తెలిపారు.

జీవనదులుగా ఉపనదులు...

జీవనదులుగా ఉపనదులు...

రాష్ట్రంలో ప్రవహిస్తున్న ఉప నదులను జీవ నదులుగా మార్చుకునే దిశగా గోదావరి నిరంతరం నీటితో కళకళలాడే విధంగా చేయడంపై హనుమంతరావు నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నామని హరీష్ రావు తెలిపారు.

కోటి ఎకరాలకు నీరు...

కోటి ఎకరాలకు నీరు...

తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించడమే తమ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. హనుమంతరావు, హరీష్ రావుల భేటీపై నీటిపారుదల శాఖ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

English summary
Irrigation expert Hanumanth Rao praised Telangana CM K Chandrasekhar Rao's power point presentation on irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X