కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాముకు బర్త్ డే: వృత్తికి తోడ్పాటు అవుతున్న పాముకు జన్మదిన వేడుకలు చేసిన యజమాని

మనుషుల మద్య ఈర్ష్యా, ద్వేషాలతో కొట్టుకొని చస్తున్న రోజులివి. పక్కవాడు బాగుపడితె ఓర్చుకోలేని పరిస్థితులివి.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కరీంనగర్:మనుషులకు మనుషుల మద్య ఈర్ష్యా, ద్వేషాలతో కొట్టుకొని చస్తున్న రోజులివి. పక్కవాడు బాగుపడితె ఓర్చుకోలేని పరిస్థితులివి. నవమాసాలు కడుపులో పెట్టుకొని కనిపెంచిన తల్లీతండ్రులను సాకకుండా బయటకు నెట్టె దౌర్బాగ్యమైన దినాలివి.తన వృత్తికి తనకు సాయం చేస్తున్న,ఓ పామును కన్నబిడ్డలా పెంచుతూ, ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నాడొ వ్యక్తి.....

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన గంగారాం పాములను పట్టి అడవిలో వదిలేసె వృత్తి చేస్తుంటాడు. వారి తాతముత్తాతల నుండి వస్తున్న వృత్తి కాబట్టి అతను కూడ ఆ వృత్తిని కోనసాగిస్తున్నాడు. అయితె గ్రామంలోని కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడ అతన్ని పాముల గంగారాం అని పిలుస్తుంటారు. తమ ఇంట్లోకి పాములు వస్తే పిలిచి పట్టిస్తుంటారు.

Happy Birthday to u my snake

గంగారాం పొట్టతిప్పల కోసం తనవద్ద రెండు పాములను ఉంచుకున్నాడు, గ్రామాల్లో తిరుగుతూ నాదస్వరంతో పాములను ఆడిస్తూ వచ్చె డబ్బులతో కుటుంబాన్నీ పోషించుకుంటుంటాడు.గంగారాం కు ఇద్దరు పిల్లలు, వారి ఆలనపాలన ఎలా చూసుకుంటున్నాడొ, తనకు అన్నం పెడుతున్న పాములను కూడ అలాగె చూసుకుంటాడు.

ప్రతిరోజు పాలు, గుండ్లు పెట్టి వాటిని కాపాడుకుంటున్నాడు, అంతెకాదు అయన పిల్లలకు ఎలాగైతేె ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు జరుపుతాడొ, తనవద్ద ఉన్న పాములకు కూడ ఆ వేడుకలు నిర్వహిస్తాడు.

Happy Birthday to u my snake

ఆదివారం తనవద్ద ఉన్నపాము పుట్టినరోజు ఉండటం వల్ల నాగుపాముకు "పుట్టిన రోజు" వేడుకలు నిర్వహించాడు.కేకు తెచ్చి, పాయసం చేసి, తానే క్యాండిల్ ఊది, బర్త్ డే వేడుకలు చేశాడు.

మనిషికి తన అనే వారి పైనే ప్రేమ లేని ఈ రోజుల్లో "విషనాగు" అని తెలిసి కూడా తనకు అన్నం పెడుతుందన్న కృతజ్ఞతతో ఇలా మూగజీవానికి వేడుక చేసిన గంగారం నిజంగా అభినందనీయుడే.

English summary
Happy Birthday to u my snake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X