వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుట్ర చేస్తున్నారు, మనిషి భయంగా బతుకుతున్నాడు: హరగోపాల్‌

భారత సమాజంలో అన్ని మతాకు సమాన హక్కు కల్పించిన లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర పాక వర్గాలు చేస్తున్నాయని పౌరహక్కుల నాయకుడు ప్రొపెసర్‌ హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: భారత సమాజంలో అన్ని మతాలకు సమాన హక్కు కల్పించిన లౌకికవాదాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర పాక వర్గాలు చేస్తున్నాయని పౌరహక్కుల నాయకుడు ప్రొపెసర్‌ హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ భావజాలాన్ని దేశవ్యాప్తం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉన్న విశ్వవిద్యాయాల్లో వారి భావజాం ఉన్న వారినే నియమించి మాట్లాడే స్వేచ్ఛలేకుండా చేస్తున్నారన్నారు.

దేశంలో ఉన్న 14 కేంద్రీయ విశ్వవిద్యాయాలను విధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం గిరాయిపల్లి అమరుల సంస్మరణ సభ హన్మకొండ ఆర్ట్స్ అండ్‌ సైన్స్‌ కళాశా ఆడిటోరియంలో జరిగింది. సభలో గిరాయిపల్లిలో అమరులైన 1975 జులై 24 అర్థరాత్రి మెదక్‌ జిల్లా గిరాయిపల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో అమరులైన సూరపనేని జనార్ధన్‌రావు, ంకా మురళీమోహన్‌ రెడ్డి, కొలిశెట్టి ఆనందరావు, వనపర్తి సుధాకర్‌ను తుచుకుని నినాదాు చేశారు.

 Hara Gopal unhappy with unversities

ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో అమరును తుచుకుంటూ గీతాలు పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరగోపాల్‌ మాట్లాడుతూ హిందూ మతోన్మాద సంఘాలు ఇటీవల గోవాలో ఏర్పాటు చేసిన సదస్సులో భారత రాజ్యాంగాన్ని తిరస్కరించారన్నారు. అంటే భవిష్యత్తులో ఎలాంటి సమాజాన్ని నిర్మించుకోబోతున్నాం... ? ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండబోతోంది ... ? రానున్న సమాజం ఇంకా ఎంత హింసాత్మకంగా మారబోతోంది ... ? అనేది ప్రతీ ఒక్కరు ఆలోచించాని సూచించారు.

భవిష్యత్‌లో రాష్ట్రయ దళ్‌ స్వయం సేవక్‌ సంఘం భావజాలం ఎంత విస్తరించబోతుందనేది ప్రతీ ఒక్కరు సీరియస్‌గా ఆలోచించాల్సి ఉందన్నారు. ఇటీవల ఢల్లీలో ప్రొఫెసర్ల సదస్సు జరిగిందని, అక్కడికి వచ్చిన అలీగడ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు చెబుతూ తాను ఢల్లీికి భయం భయంగా చేరుకున్నానని చెప్పారన్నారు. ప్రస్తుతం సమాజంలో మనిషి ఇంత భయంగా ఎందుకు జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిరదని ప్రశ్నించారు.

దేశ సంపదలో 60 శాతం డబ్బు 1 శాతం మంది చేతుల్లోనే ఉందని, వారే దేశ రాజకీయాను శాసిస్తున్నారని తెలిపారు. ఏదో ఒక జంతువు పేరు చెప్పి మనుషుల్ని చింత్రహింసకు గురి చేసి చంపుతుంటే లౌకిక వాదం ఏమైందని ప్రశ్నించారు. మత కల్లోలాలు చెలిరేగి వేలాది మంది చనిపోతే బాధ్యులెవరని ప్రశ్నించారు. దేశంలో ఇప్పుడు మతం ప్రధాన ఆంశంగా మారిందని తెలిపారు.

పేదరికం, నిరుద్యోగం, అభివృద్ధిపై జరగాల్సిన చర్చ ఇప్పడు మతం, విశ్వాసంపై జరుగుతుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అమరు బంధు మిత్రుల సంఘం నాయకురాలు శాంత అధ్యక్షతన జరిగిన సభలో విరసం నేత బాసిత్‌, వీక్షణం ఎడిటర్‌ ఎస్‌. వేణుగోపాల్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

English summary
Civil Liberties leader prof Haragopal expressed his unhappinss situation prevailed in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X