• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పెద్దనోట్ల రద్దు చారిత్రక తప్పిదం: హరగోపాల్

|

వరంగల్‌: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసి చారిత్రక తప్పిదం చేసిందని, 1946లోనే దేశంలో బ్లాక్‌మనీపై చర్చ జరిగిందని కానీ, అప్పటి ఆర్‌బీఐ గరవర్నర్‌లుగా పనిచేసిన ప్రముఖులు దేశ ఆర్తిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని పెద్నఓట్ల రద్దును తిరస్కరించారని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జి హరగోపాల్‌ అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ ఆచార్య సాయన్న అధ్యక్షతన నిర్వహించిన అర్థశాస్త్ర ఆచార్యులు స్వర్గీయ శివరామకృష్ణరావు తొలిస్మారకోపన్యాసం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త హరగోపాల్‌ పాల్గొని ఆచార్య శివరామకృష్ణ చిత్ర పానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరగోపాల్‌ 'డిమానిటైజేషన్‌ ఎఫెక్ట్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకనామీ' అనే అంశంపై ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో ప్రజలు ఒకే విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారని అన్నారు. 2 శాతం ఉన్న సంపన్నులు సేఫ్‌గా ఉన్నప్పటికీ 98శాతం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ దేశం వృద్ధిరేటు (జీడీపీ) 120 కోట్లు ప్రజలు ఉంటే కరెన్సీ మాత్రం 18 లక్షల కోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని తెలిపారు.

సమాజంలో ఉండే సంపదకు మూల కారణం మనిషి శ్రమేనని అన్నారు. డిమానిటైజేషన్‌ మీదే మీడియాలో వచ్చిన చర్చ నిజమైన చర్చ కాదని అది మిస్సింగ్‌ చర్చ అని అన్నారు. 19వ శతాబ్దంలో మన దేశానికి కరెన్సీ వచ్చిందని ఆయన తెలిపారు. 1946 నుంచే బ్లాక్‌ మనీ చర్చ మన దేశంలో ఉందన్నారు. ఆర్‌బీఐ గవర్నర్లుగా వైవీ రెడ్డి, దువ్వూరి సుబ్బారావ్‌, రాజన్‌ ఉన్నప్పటి నుంచి బ్లాక్‌ మనీ విషయంలో భారత ప్రభుత్వానికి, రిజర్వ్‌ బ్యాంక్‌ మధ్య చాలా కాలంగా చర్చ జరుగుతుందని తెలిపారు.

Haragopal on big notes ban

డిమానిటైజేషన్‌ కేవలం డబ్బుల రూపంలో కాకుండా సిరాస్థులు కూడా వర్తిస్తుందన్నారు. హైదరాబాద్‌లో కేవలం 16 మంది వ్యక్తుల చేతుల్లోనే ఒక లక్షా ఎకరాల భూమి ఉందని దీనినే బ్లాక్‌ ఎకనామీ అంటారని తెలిపారు. దేశంలోని 120 కోట్ల మంది జనాభాలో కేవలం కొంతమంది ప్రజల వద్ద సంపద కేంద్రీకృతమైందని అన్నారు. డిమానిటైజేషన్‌ వల్ల వచ్చే రూ. 3 లక్షల కోట్ల బ్లాక్‌ మనీ వైట్ అయితే వాటిని దేనికోసం ఖర్చు పెడుతారని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుత అస్పష్టమైన పరిస్థితిపై ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత మేధావులు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేయూ వీసీ సాయన్న మ్లాడుతూ.. శివరామకృష్ణ రావు గొప్ప మానవతవాదిగానే కాకుండా గొప్ప అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా కేయూకు సేవలు అందించారని తెలిపారు. ఆయన పేరు మీద బంగారు పతకం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

నగదురహిత ప్రత్యామ్నాయాలే ఉత్తమం: కలెక్టర్‌ అమ్రపాలి

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 15 నాటికి నగదురహిత ప్రత్యామ్నాయ మార్గాలను అమలులోకి తేవాలని కలెక్టర్‌ అమ్రపాలి సూచించారు. దేశంలో కరెన్సీ 85 శాతం రద్దయిందని, మిగిలిన 15 శాతంతో నగదు లావాదేవీలు నిర్వహించడం కష్టమన్నారు. అయినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసుకోవాలని సూచించారు.

సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మెడికల్‌ షాపులు, లిక్కర్‌ స్టోర్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్స్, హోటల్స్‌, రైస్‌మిల్లర్లు, ఎల్‌పీజీ డీలర్లు, పెట్రోల్‌పంప్‌ యజమానులతోపాటు బ్యాంకర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మ్లాడుతూ.. వాణిజ్య వర్గాలు తమ దుకాణాల్లో పనిచేసే వారికి డిసెంబర్ 31లోగా బ్యాంక్‌ ఖాతాలు తెలిపించాలని సూచించారు. ప్రతీ ఒక్కరు కనీసం రెండు లావాదేవీలు ఆన్‌లైన్‌లో చేసి చూపించాలని, దీనిపై అధికారులు పర్యవేక్షిస్తారన్నారు.

మొబైల్‌ బ్యాంకింగ్‌ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న చిన్న ఫోన్‌ ద్వారా కూడా చేయొచ్చని పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా చూపించారు. దీనిపై వాణిజ్య వర్గాల ప్రతినిధులు మ్లాడుతూ.. వీలైనంత త్వరగా పాయింట్ ఆఫ్‌ సేల్‌ మిషన్లు సరఫరా చేయాలని, సాంకేతిక పరంగా సమస్యలు ఏర్పడితే సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో జేసీ దయానంద్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సాయిప్రసాద్‌, డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Professor Haragopal responded on big notes ban issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X