వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్, దేహశుద్ధి: నిర్బయ కేసు

విధ్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: పవిత్రమైన వృత్తిలో పనిచేస్తూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతూ ఉపాధ్యాయ వృత్తికే తలవంపులు తెస్తున్నారు. ఇలాంటి సంఘటన పాలకుర్తి మండలం కేంద్రంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో హిందీ సబ్జెక్ట్‌ బోధిస్తున్న రాయపర్తి మండలంలోని కోలన్‌పల్లి గ్రామానికి చెందిన కార్తీక్‌.. గత కొద్ది రోజులుగా పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులను వేధిస్తున్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

అతని చేష్టలు మితిమీరిపోవడంతో మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కొంత మంది విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు సిద్థార్థ పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ జక్కుల రవీందర్‌ ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయునిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Harassment: A teacher arrested

రౌడీషీటర్‌ హత్య కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్టు

లింగాలఘనపురం: పాత కక్షలతో డిసెంబరు 27న రౌడీషీటర్‌ను హత్యచేసిన ఘటనలో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జనగామ రూరల్‌ సీఐ తిరుపతి, ఎస్సై వేణుగోపాల్‌‌తో కలిసి నిందితుల అరెస్టును చూప్టోరు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామశివారు ఆర్టీసీ కాలనీకి చెందిన మురళి(37) అనే రౌడీషీటర్‌ను డిసెంబర్‌ 27న పాత కక్షలతో తన వరసకు బావ అయిన శివరాత్రి వెంకటస్వామి, అతని తండ్రి అబ్బయ్య కిరాయి హంతకులతో కలిసి హత్య చేయించారు.

ఈ కేసులో ఇప్పటికీ నలుగురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటల్లో సూత్రధారి వెంకటస్వామి పరారీలో ఉండగా గాలించిన పోలీసులు తాజాగా హత్య చేయించిన వెంకటస్వామి, నెక్కొండ మండలానికి చెందిన అతని అనుచరురాలు కల్యాణిని గురువారం అరెస్టు చేశారు. కేసులో ఏ1గా వెంకటస్వామి, ఏ7గా కల్యాణిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

English summary
A teacher allegedly arrested for harassing girl students, in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X