వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పింక్ నా తెలంగాణ కలర్’: వివిఎస్ లక్ష్మణ్ వీడియో హల్‌చల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు, స్టైలిష్ బ్యాట్స్‌మెన్ వివిఎస్ లక్ష్మణ్ ఇటీవల తన షర్ట్‌పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఆ హైదరాబాదీ ఇప్పుడు వ్యాఖ్యతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అంతేగాక, పిచ్ రిపోర్ట్ ఇచ్చేందుకు కూడా వస్తున్నాడు. అయితే ఇటీవల టీవీ షోల కోసం లక్ష్మణ్ భిన్నమైన షర్ట్స్ వేసుకొస్తున్నాడు. అప్పట్లో పిచ్చుకలతో కూడిన చిత్రాలు కలిగిన షర్ట్ వేసుకొచ్చి చర్చకు దారితీశాడు. తాజాగా, ఇటీవల ఆసియాకప్‌లో వేసుకున్న ఆయన షర్ట్ కూడా చర్చకు దారితీసింది.

పింక్ షర్ట్ వేసుకున్న లక్ష్మణ్ ఊహించని సమాధానంతో తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. లక్ష్మణ్ వేసుకున్న పింక్ షర్ట్‌ను గ్లోరియస్ పింక్‌గా ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కామెంట్ చేశాడు.

ఆ కామెంట్‌కు స్పందించిన లక్ష్మణ్ ఆ రంగు తన తెలంగాణ రాష్ట్ర కలర్ అన్నాడు. పింక్ షర్ట్ వేసుకుని సొంత రాష్ట్రం తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపాడు.

ఈ హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్‌మన్ చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న మరో హైదరాబాదీ భోగ్లే తోపాటు హెడెన్లు నవ్వేశారు. క్వీన్స్‌లాండ్ డ్రెస్సును హెడెన్ వేసుకున్నాడని భోగ్లే ఛమత్కరించాడు. కాగా, తాను వేసుకుంది బీచ్ డ్రెస్ అంటూ హెడెన్ ఆ సెటైర్‌కు సమాధానం ఇచ్చుకున్నాడు.

Harbhajan Singh continues his critique of VVS Laxman's dressing sense

ఆ తర్వాత, తన షర్ట్‌పై నీ అభిప్రాయమేంటని భారత స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ను లక్ష్మణ్ ప్రశ్నించాడు. 'మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు. నవజోత్ సిద్ధు కూడా వ్యాఖ్యాతగా ఇలాంటి షర్ట్స్‌తో ఆకట్టుకునేవారు'అని భజ్జీ వ్యాఖ్యానించాడు. అయితే, మొత్తానికి లక్ష్మణ్ షర్ట్ ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

English summary
Team India former cricketer VVS Laxman interrupted another conversation, when Bhajji was not around, and explained, “I am wearing pink because pink is the colour of my state Telengana. I am supporting my state.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X