వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహనం వదిలి,పోలీసులకు చెప్పకుండానే హరీష్ ఇలా...ఎందుకంటే?

హంగు, ఆర్బాటం లేకుండానే విఐపీ హోదా తెలిపే చిహ్నలు లేకుండా కనీసం పోలీసులకు, పార్టీ నాయకులు సమాచారం ఇవ్వకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం నాడు కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాగర్ కర్నూల్:హంగు, ఆర్బాటం లేకుండానే విఐపీ హోదా తెలిపే చిహ్నలు లేకుండా కనీసం పోలీసులకు, పార్టీ నాయకులు సమాచారం ఇవ్వకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం నాడు కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను తనిఖీ చేశారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి హారీష్ రావు మంగళవారం నాడు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం పనులకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రులు ఉపయోగించే వాహనాలను ఉపయోగించలేదు. సాధారణ వాహనాల్లోనే మంత్రులు లిప్ట్ ఇరిగేషన్ ను తనిఖీ చేశారు.

Hareesh Rao surprise inspection at Kalwakurthy lift scheme

కనీసం పోలీసులకు, స్థానిక పార్టీ నాయకులకు కూడ సమాచారం ఇవ్వకుండానే మంత్రులు లిప్ట్ ఇరిగేషన్ వద్ద ఆకస్మిక తనిఖీ చేశారు.మంగళవారం నాడు ఉదయం పదిన్నర గంలలకే మంత్రులు కోడేరు మండలంలోని జొన్నలబోగూడ సమీపంలోని ఏర్పాటు చేసిన 2వ, ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకొన్నారు.

ఐదు మోటార్ల పనితీరును పరిశీలించారు.అధికారులను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకొన్నారు.నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లిగట్టు సమీపంలో కొనసాగుతున్న మూడో లిఫ్ట్ పనులను పరిశీలించారు. క్రేన్ లో భూగర్భంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులను చూశారు.

అనంతరం కల్వకుర్తి లిప్ట్ ఇరిగేష్ ముఖ్య ఇంజనీర్ ఖగేందర్ తదితరులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. చివరి దశ పనులు ఎప్పటిలోపుగా పూర్తి చేస్తారని మంత్రి హరీష్ రావు కోరారు.

ఖరీఫ్ కు సాగునీరు అందించే లక్ష్యంతో పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని కోరారు. తర్వాత మూడో ఎత్తిపోతల పనులను పరిశీలించేందుకు ప్రధాన కాల్వ వెంట బిజినేపల్లి , తిమ్మాజీపేట, కల్వకుర్తి , మిడ్జిల్ మండలాల్లో పర్యటించారు. జూన్ నాటికి పనులు పూర్తి కావాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి చెప్పారు.

English summary
Telangana Irrigation minister Harish Rao surprise inspection at kalwakurthy lift scheme on Tuesday. Along with Health minister Laxma Reddy , Hareesh inspected ongoing works at project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X