వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెటీఆర్‌‌ను హరీష్ తిరస్కరిస్తారా: ఆ ప్రకటనలోని ఆంతర్యం అదేనా...

కెటిఆర్ నాయకత్వాన్ని అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేరా... మల్లుభట్టి విక్రమార్క ఈ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో ఇరువురు మంత్రులు కెటి రామారావుకు, హరీష్ రావుకు మధ్య నాయకత్వం కోసం అంతర్గత పోరాటం జరుగుతోందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇరువురి మధ్య విభేదాలు మరింత పెరుగతాయని ఆయన అంటున్నారు.

కెసిఆర్ మరో 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని హరీష్ రావు అన్న మాటలకు మల్లు భట్టి విక్రమార్క కొత్త అర్థం తీశారు. కెసిఆర్ తర్వాత కెటిఆర్‌కు అధికారం అప్పగించాలనే ఆలోచనను హరీష్ రావు అంగీకరీంచడం లేదనే విషయాన్ని ఆ మాటలు పట్టిస్తున్నాయని ఆయన అన్నారు.

Harish dislikes seeing KT Rama Rao as CM, says Congress

అంతేకాకుండా, కెసిఆర్ గానీ తాను గానీ ఉండాలని హరీష్ రావు భావిస్తున్నారు తప్ప మూడో వ్యక్తిని అంగీకరించడానికి సిద్ధంగా లేరని ఆయ న్నారు ఎన్‌ఎస్‌యుఐ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ఆదివారంనాడు ఆ వ్యాఖ్యలు చేశారు.

తెరాసలో అంతర్గత పోరు మరింత తీవ్రమవుతుందని, దానిపై కాంగ్రెసు నేతలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. హరీష్ రావును పార్టీ నుంచి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మరో కాంగ్రెసు నేత సర్వే సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదని అనడాన్ని బట్టి హరీష్ రావు కాంగ్రెసులో చేరి, ఆ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు.

English summary
Wading into the speculated power struggle between irrigation minister T. Harish Rao and IT minister K.T. Rama Rao over the succession issue in the TRS, the Congress leaders said the tussle between the two leaders could deepen in the future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X