వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ ఆస్తిలో వాటా, విభజన 'గాయం': బాబుకు హరీష్ రావు 18 ఘాటు ప్రశ్నలివే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : బాబుకు హరీష్ రావు 18 ఘాటు ప్రశ్నలివే..!! | Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు 18 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు. తాము ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వచ్చామని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం విడ్డూరమని చెప్పారు.

షాకింగ్: 'అంతర్యుద్ధం, టీఆర్ఎస్-కూటమికి సమాన సీట్లు వస్తే హరీష్ రావు ముఖ్యమంత్రి'షాకింగ్: 'అంతర్యుద్ధం, టీఆర్ఎస్-కూటమికి సమాన సీట్లు వస్తే హరీష్ రావు ముఖ్యమంత్రి'

ఈ సందర్భంగా పలు కుట్రలు చేశారంటూ పద్దెనిమిది ఘాటు ప్రశ్నలు సంధించారు. ఈ కుట్రలు మీరు చేయలేదా అంటూ నిలదీశారు. కనీసం కుట్రలు చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటున్నందున, ఇలాంటివి మరోసారి చేయమని క్షమాపణ చెప్పారా అని నిలదీశారు. హరీష్ రావు సంధించిన 18 ప్రశ్నలు ఇవే.

 కుట్రలు నిజం కాదా?

కుట్రలు నిజం కాదా?

1. నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేయడం లేదా? 2. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కడతామని 2014లో మీరు హామీ ఇవ్వలేదా? 3. కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? 4. పాలేరుకు నీళ్లు ఇవ్వడం పాపమా? 5. కేసీ కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా? 6. కల్వకుర్తిపై కుట్రలు చేస్తోంది నిజం కాదా?

 ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు

ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు

7. పోలవరానికి బదులు కృష్ణా నీళ్లివ్వకుండా నాటకాలు ఆడటం లేదా? 8. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు నీళ్లు ఇవ్వొద్దని చెప్పడం మీ కుతంత్రం కాదా? 9. ఎవరి అనుమతితో ఏపీ కొత్త ప్రాజెక్టులు కడుతోందో చెప్పాలని నిలదీశారు. 10. పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను గుంజుకోవడం అన్యాయం కాదా?

అది మీ కుంచితత్వం కాదా?

అది మీ కుంచితత్వం కాదా?

11. సీలేరు విద్యుత్ ప్లాంటు తీసుకోవడం వల్ల తెలంగాణకు ఏడాదికి రూ.500 కోట్లు నష్టం చేయలేదా? 12. విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా?13. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) ఏకపక్షంగా రద్దు చేసి తెలంగాణకు 2వేల 465 మెగావాట్ల విద్యుత్ ఎగ్గొట్టలేదా? 14. ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వకుండా కరెంట్ టెండర్లలో పాల్గొనడం మీ కుంచితత్వం కాదా? రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా?

హైదరాబాద్ ఆస్తుల్లో వాటా కోరడం దురాశ కాదా?

15. 1,153 మంది ఏపీ విద్యుత్ ఉద్యోగులను ఏపీకి తీసుకోకుండా మా పైన రూ.వెయ్యి కోట్ల భారం మోపడానికి కారణం మీరు కాదా? 16. హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ మాకు అప్పగించకపోవడం మీ సంకుచిత బుద్ధికి నిదర్శనం కాదా? 17. హైదరాబాద్ ఆస్తుల్లో వాటా కోరడం దురాశ కాదా? 18. విభజన మాయని గాయం అని మీరు బాధపడలేదా? అని 18 ప్రశ్నలను హరీష్ రావు సంధించారు.

English summary
Telangana Minister Harish Rao 18 questions to Andhra Pradesh CM Chandrababu Naidu for contesting Telangana Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X