వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయట పొగుడ్తలు.. లోపల విమర్శలా!: సంపత్‌తో హరీశ్, ‘ఎర్రబెల్లి జూనియర్’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో లాబీల్లో ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ మధ్య, ఇటీవల టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిల మధ్య కొద్దిసేపున ఆసక్తికరమైన సంభాషణ జరిగాయి.

ప్రశ్నోత్తరాల తర్వాత మీడియా పాయింట్‌కు వెళ్తున్న హరీశ్‌రావుకు లాబీలో కాంగ్రెస్ సంపత్ కుమార్ ఎదురుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని సంపత్ ప్రశంసించారు. దీనికి స్పందించిన హరీశ్ రావు 'బయటనేమో పొగుడుతవ్.. లోపల మాత్రం విమర్శిస్తవ్' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

'లేదన్నా! బడ్జెట్‌పై చర్చలో మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల గురించి పాజిటివ్‌గా మాట్లాడిన, ఎవరినన్నా అడగండి' అంటూ సంపత్ చెప్పడం గమనార్హం. పక్కనే ఉన్న నిజామాబాద్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కల్పించుకుని 'ఎక్కడ పొగిడారు' అంటూ ప్రశ్నించారు.

Harish Rao comments on Sampath Kumar

మీరు జూనియరే! ఎర్రబెల్లితో మంచిరెడ్డి సరదా వ్యాఖ్యలు

ఇది ఇలా ఉండగా, ఇటీవల టిఆర్ఎస్ పార్టీలు చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రకాశ్ గౌడ్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, రాజేందర్ రెడ్డిలతో కలిసి సమావేశాల విరామ సమయంలో మంత్రి కెటి రామారావును కలిసేందుకు వెళుతున్నారు. అదే సమయంలో లిఫ్ట్ బయట కనిపించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిన కూడా తమతో రావాలని పిలిచారు ఎర్రబెల్లి.

ఎక్కడికి అని ప్రశ్నించగా.. 'నేను రమ్మంటున్నా.. రావాలంతే' అని కిషన్ రెడ్డితో ఎర్రబెల్లి అన్నారు. దీంతో 'నేను సీనియర్.. మీరు జూనియర్' అని ఎర్రబెల్లితో నవ్వుకుంటూ అన్నారు మంచిరెడ్డి. తర్వాత లిఫ్ట్ ఎక్కి ఎర్రబెల్లితో కలిసి వెళ్లారు.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఎర్రబెల్లి దయాకర్ రావు కంటే ముందే టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అందుకేనేమో తాను సీనియర్‌ని అని ఎర్రబెల్లితో అన్నట్లున్నారు.

English summary
Telangana Minister Harish Rao responded on comments of Congress MLA Sampath Kumar about government projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X