• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాగునీటి స‌మీక్ష‌కు హ‌రీష్ రావు ఎందుకు హాజ‌రు కాలేదు..? కార‌ణం అదేనా..?

|

హైద‌రాబాద్: ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఇదివరకటిలా హరీష్‌కు ప్రాధాన్యం ఇవవటం లేదా..? తన కొడుకును ముఖ్యమంత్రి చేసి పార్టీలో తానే కీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పాలని భావిస్తున్నారా? అనే అంశం ప‌ట్ల పార్టీ శ్రేణుల్లో చర్చలు ఊపందుకున్నాయి. మరోవైపు కీలకమైన ఇరిగేషన్ శాఖను ఈసారి హరీష్‌కు ఇస్తారా? లేదా ఎంపీగా పంపిస్తారా ? అనే భయం హరీష్ వర్గాన్ని వెంటాడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసమే కేసీఆర్ ఇలా హరీష్ రావును పక్కన పెడుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

 తెలంగాణ‌లో అందరి ద్రుష్టి హ‌రీష్ పైనే..! పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ స్థానం ఏంటనే అంశం పై చ‌ర్చ‌..!!

తెలంగాణ‌లో అందరి ద్రుష్టి హ‌రీష్ పైనే..! పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ స్థానం ఏంటనే అంశం పై చ‌ర్చ‌..!!

ఈ సారి తెలంగాణ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ నడుమ సాగాయి. ఎన్నికల అనంతరం గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస్ అధికారం లోకి రావటం.. ఆ వెంటనే కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయటం చకచకా జరిగిపోయాయి. అయితే గులాబీ బాస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ని నియమించిన నాటి నుంచి మరో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్‌ని త్వరలోనే ముఖ్యమంత్రి సీట్లో కుర్చోపెట్టనున్నారనే టాక్ ఎక్కువైంది. దీంతో ప్రతీ ఒకరి చూపు టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావుపై పడింది.

 కేటీఆర్ కి పార్టీ ప‌గ్గాలు..! మ‌రి హ‌రీష్ ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్న ఫాన్స్..!!

కేటీఆర్ కి పార్టీ ప‌గ్గాలు..! మ‌రి హ‌రీష్ ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్న ఫాన్స్..!!

హరీష్ రావు పరిస్థితి ఏంటి? ప‌ఆర్టీలో ఆయ‌న ప్రాధాన్య‌త దేనికి ప‌రిమితం అవుతుంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అప్పటి నుంచి హరీష్ రావు గురించి ఏదో ఒక వార్త ప్రతిరోజు జనంలో నానుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ రావును వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేయించి రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజ‌కీయాల‌కు ప‌రిమితం చేయనున్నారనే వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో వినపడుతుండటం తెలంగాణలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పైకి అంతా ఓకే...! లోప‌ల మాత్రం ఏదో జ‌రుగుతోందంటున్న హ‌రీష్ వ‌ర్గం..!!

పైకి అంతా ఓకే...! లోప‌ల మాత్రం ఏదో జ‌రుగుతోందంటున్న హ‌రీష్ వ‌ర్గం..!!

అదే సమయంలో తెలంగాణ కొత్త కేబినెట్‌లో హరీష్ రావుకు ఈసారి భారీ నీటిపారుదల శాఖ కూడా కేటాయించడం లేదనే మరో వార్త కూడా హరీష్ వర్గాన్ని కలవరపెడుతోంది. ఓ రకంగా చెప్పాలంటే.. కేసీఆర్‌తో కలిసి టీఆర్ఎస్ పార్టీని మొదటి నుంచీ నడిపిస్తూ కీలకంగా వ్యవహరించింది హరీష్ రావు మాత్రమే. తీరా ఇప్పుడు ఆయనను పార్టీ విస్మయించటం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. లోలోపల ఏదో జరుగుతోందనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

 ఢిల్లీ రాజ‌కీయాల్లోకి హ‌రీష్..! జోరుగా సాగుతున్న ఊహాగానాలు..!!

ఢిల్లీ రాజ‌కీయాల్లోకి హ‌రీష్..! జోరుగా సాగుతున్న ఊహాగానాలు..!!

దీనికి తోడు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ 7 గంటల పాటు నిర్వహించిన సమావేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. అయితే పోయినేడాది నీటిపారుదల శాఖ మంత్రిగా విశేష సేవలందించిన హరీష్ రావు ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో అంతా షాక్ అయ్యారు. కరీంనగర్ ఎంపీ వినోద్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనటం పలు అనుమానాలకు తావిస్తోంది. హ‌రీష్ హ‌జ‌రు కాక పోవ‌డం వెన‌క కార‌ణం ఏంట‌ని ఆయ‌న అనుచ‌రులు ఆరా తీస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Is Chief Minister Chandrasekhar Rao not giving important to Harish? Do you think the chamber should turn his son to the chief minister and play the key role in the party? Discussions in the party ranks have taken place for the topic. On the other hand, Hareesh skipped the crucial irrigation review which was conducted by chief minister. Harish contesting as MP and taking him to the national politics? It seems that the fear of the Harish community is haunting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X