వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవి గూడ అంజయ్యకు హరీశ్ చేయూత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ కవి గూడ అంజయ్యకు మెరుగైన వైద్యం అందిస్తామని, ఇందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ మంత్రి టి. హరీష్ రావు చెప్పారు. కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న గూడ అంజయ్యను ఆదివారం హైదరాబాదులోని అడిక్‌మెట్‌లోని ఆయన నివాసంలో హరీష్ రావు పరామర్శించారు.

పార్టీ తరఫున హరీష్ రావు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని గూడ అంజయ్యకు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తన పాటలతో ఎంతో మందిని చైతన్యవంతులను చేసిన గూడ అంజయ్యను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని ఆయన చెప్పారు. అంజయ్య కోరుకున్న ఆస్పత్రిలో వైద్యం చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

గూడ అంజయ్య కూతురు మమత చదువు ఖర్చులను భరిస్తామని, ఆణెకు ఉద్యోగావకాశం కల్పిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. గూడ అంజయ్య సేవలు బంగారు తెలంగాణ సాధనకు ఎంతో అవసరమని అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హరీష్ రావుతో పాటు గూడ అంజయ్యను పరామర్శించారు.

తన పాటలతో ప్రజల్లో పెను మార్పులు తెచ్చిన గూడ అంజయ్యను కాపాడుకుంటామని బాలకిషన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) యువజన విభాగం నాయకులు పూసరాజు, మాజీ కార్పోరేటర్ బి జయరామిరెడ్డి, కె. సురేందర్, శ్యామసుందర్ (చిట్టీ), గురుచరణ్ సింగ్ కూడా వారితో పాటు వచ్చారు.

తనను గుర్తించి ఆదుకుంటానని ప్రభుత్వం భరోసా ఇచ్చిందని గూడా గూడ అంజయ్య అన్నారు. ఆరోగ్య పరిస్థితి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు హామీతో రాష్టర్ పునర్నిర్మాణంలో తన బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ కోసం పాటలు రాస్తానని, త్వరలో తన పాటలను సీడీ రూపంలో తీసుకుని వస్తానని ఆయన చెప్పారు.

English summary
Telangana minister Harish Rao extended financial assistance to poet Gooda Anjaiah, who is suffering ill health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X