వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రిపుల్ ఆర్ పరిధిలోకి మిషన్ కాకతీయ: కేంద్రమంత్రులతో హరీశ్ బేటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చెరువుల మరమ్మతు, పునరుద్దరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాన్ని ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుల పరిధిలోకి చేర్చాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్ రావు, టిఆర్‌ఎస్ ఏంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, తెలంగాణ నీటిపారుదల సలహాదారు సిహెచ్ విద్యాసాగర్‌రావు తదితరులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, జౌళి, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌లతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ప్రాణహితకు జాతీయ హోదా కల్పించవలసిందిగా కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కోరామని ఆయన చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి పంపుతున్నట్లు ఆయన తెలియచేశారు.

కాకతీయ మిషన్ రెండవ దశ ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించినట్లు ఆయన చెప్పారు. దేవాదులకు ఇవ్వవలసిన 400 కోట్లను విడుదల చేయవలసిందిగా మంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున కృష్ణా జలాల పంపిణీపై తాను, మాట్లాడనని చెబుతూ, కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణాకు న్యాయం జరిగి తీరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రితో హరీశ్

కేంద్రమంత్రితో హరీశ్

చెరువుల మరమ్మతు, పునరుద్దరణకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాన్ని ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుల పరిధిలోకి చేర్చాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రితో హరీశ్

కేంద్రమంత్రితో హరీశ్

ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.

కేంద్రమంత్రితో హరీశ్

కేంద్రమంత్రితో హరీశ్

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్ రావు, టిఆర్‌ఎస్ ఏంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, తెలంగాణ నీటిపారుదల సలహాదారు సిహెచ్ విద్యాసాగర్‌రావు తదితరులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, జౌళి, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్‌లతో భేటీ అయ్యారు.

కేంద్రమంత్రితో హరీశ్

కేంద్రమంత్రితో హరీశ్



ఈ సందర్భంగా ప్రాణహితకు జాతీయ హోదా కల్పించవలసిందిగా కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కోరామని ఆయన చెప్పారు.

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర వ్యవసాయ, జౌళిశాఖ మంత్రులు రాధామోహన్ సింగ్, సంతోష్‌కుమార్ గాంగ్వార్‌లకు ఆయన వివరించారు. వ్యవసాయాన్ని కేంద్రం చిన్న చూపుచూస్తోందని ఈ సందర్భంగా హరీశ్ చెప్పారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ను పెంచటం పోయి తగ్గించారని ఆయన చెప్పారు. తెలంగాణలో పత్తిని కోనుగోలు చేయటానికి 84 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఇంతవరకూ 48 కేంద్రాలను మాత్రమే ప్రారంభించిందని చెప్పారు.

తేమ శాతాన్ని 12నుంచి 24 శాతానికి పెంచి పత్తిని కొనుగోలు చేయవలసిందిగా కోరినట్లు ఆయన చెప్పారు. పత్తి మద్దతు ధరను క్వింటాల్‌కు ఐదు వేల రూపాయలకు పెంచవలసిందిగా కోరినట్లు హరీశ్ తెలియచేశారు. కేంద్రప్రభుత్వం, కాటన్ కార్పొరేసన్ మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతోందని చెప్పారు. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసి ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరామని ఆయన చెప్పారు.

తెలంగాణలోని పత్తి రైతాంగం పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి నివారణ చర్యలు తీసుకోవటానికి ఒకసారి రాష్ట్రంలో పర్యటించవలసిందిగా జౌళి శాఖ కార్యదర్శిని కోరినట్లు ఆయన చెప్పారు, రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేయటం వల్ల వచ్చిన నష్టాన్ని భరిస్తామని ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు రావలసిన 212 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయవలసిందిగా కోరినట్లు చెప్పారు.

పత్తిరైతుల నుంచి బీమాకింద వసూలు చేస్తున్న 13శాతం ప్రీమియంను తగ్గించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియంలో అధిక శాతాన్ని భరించి రైతుల నుంచి తక్కువ మొత్తాన్ని వసూలు చేసే విధంగా పంటల బీమా పధకం ఉండాలని, తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలియచేశారు. పంటల బీమాను అన్ని పంటలకు వర్తింప చేయాలని ఆయన సూచించారు.

English summary
Telangana Minister Harish Rao on Tuesday met Union ministers Uma Bharti and Radha Mohan Singh for Telangana farmers issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X