వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంభమేళాను తలపించేలా పుష్కరాలు, జిల్లాలకు ఇంఛార్జీలు: హరీశ్, ఇంద్రకరణ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించేలా నిర్వహిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తుండటంతో నిర్వహణ‌కు సంబంధించిన లోటుపాట్లపై ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లు సోమవారం సచివాలయం నుండి జిల్లాల్లోని అన్నీ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జులై 14న ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను కుంభమేళా‌ను తలపించేలా జరపడానికి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా 29 వివిధ అంశాలపై మంత్రి హరీశ్ రావు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు.

ఎట్టి పరిస్తితుల్లోనూ పుష్కరాలకు వచ్చే భక్తులకు వీసమెత్తు అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రభుత్వ భాద్యత అని గుర్తు చేశారు. రాష్ట్రస్థాయిలో దేవాదాయ శాఖ, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు పుష్కరాలను పర్యవేక్షిస్తారని అన్నారు.

జులై 10వ తేదీ అర్ధ రాత్రి వరకు పుష్కర ఘాట్ పనులన్నింటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నీ శాఖలు సమన్వయం చేసుకొని చిన్న పోరాపాటు కూడా దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జులై 11వ తేదీన మంత్రులు 5 జిల్లాలలో జరిగిన పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో హరీశ్ రావు, జోగు రామన్న, ఖమ్మం జిల్లాకు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఈటెల రాజేందర్, కెటిఆర్, నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాస రెడ్డి లు జరిగిన పనులను పర్యవేక్షిస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి ఐదుగురు చీఫ్ ఇంజానీర్లను ఆయా జిల్లాలకు డెప్యుటేషన్‌పై పంపిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం నుండే వారు తమ తమ విధుల్లో హాజరవుతారు.

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించేలా నిర్వహిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తుండటంతో నిర్వహణ‌కు సంబంధించిన లోటుపాట్లపై ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లు సోమవారం సచివాలయం నుండి జిల్లాల్లోని అన్నీ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహదారు రమణాచారి, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జోషి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆర్‌అండ్‌బి ఇ.యన్.సి రవీందర్ ఫైనాన్స్ సెక్రెటరీ శివశంకర్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్

జులై 14న ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను కుంభమేళా‌ను తలపించేలా జరపడానికి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది.

జులై 11వ తేదీ పుష్కరాలకు ట్రయల్ రన్‌లాంటిదని తెలిపారు. మున్సిపల్ అధికారులు, సానిటేషన్ అధికారులు 10వ తేదీ నుండే వారికి కేటాయించిన పుష్కర ఘాట్‌ల వద్ద తమ పనిని ప్రారంభించాలని అన్నారు. స్నానాల గదులకు సంబంధించిన విషయములో ఎక్కడ కూడా అజాగ్రత్త వహించరాదని సూచించారు. పుష్కర ఘాట్లను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు చిత్త శుద్ధితో పని చేయాలని అన్నారు.

గత పుష్కరాలతో పోల్చుకుంటే ఈ సారి నాలుగైదు రెట్ల భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకోసం ఎక్కువ శ్రమించాలని అన్నారు. పుష్కర ఘాట్ల వద్ద వేస్తున్న కొత్త రోడ్ల పక్కన నాణ్యమైన మొరం వేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ఇది ఉపయోగ పడుతుందని వివరించారు.

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ పై పోలీసుల సహకారం తీసుకొని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. దేశంలోని చాలా ప్రాంతాలనుండి భక్తులు పుష్కరాలకు వస్తారు కాబట్టి వారి కోసం సైన్ బోర్డులు తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషలలొ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

English summary
Ministers Harish Rao and Indrakaran Reddy held a video conference on Godavari Pushkaralu arrangements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X