వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండువారాల్లో 10వేల పోలీసు ఉద్యోగాలు, 67ఏళ్లలో చేయలేంది 67రోజుల్లో చేశాం: హరీశ్

|
Google Oneindia TeluguNews

మెదక్: రెండువారాల్లో పది వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సోమవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో పోలీసు ఉద్యోగాల కోసం యువకులకు శిక్షణ కేంద్రం ప్రారంభించారు. అనంతరం
ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్ల సమావేశం, ఇతర సదస్సులు, కంగ్టి బహిరంగ సభలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుశాఖ నియామకాల్లో భాగంగా నాలుగు కొత్త బెటాలియన్ల ఏర్పాటుతో మరో 2400ల పోస్టులు రానున్నాయని చెప్పారు. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో దేశంలోనే ప్రప్రథమంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.

Harish Rao on Police jobs recruitment

ఖేడ్ వంటి వెనుకబడిన ప్రాంతంలో ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు ఆపద్బాంధవులని కొనియాడారు. ఆర్‌ఎంపీ, పీఎంపీల కోసం ప్రత్యేక భవనాన్ని మొట్టమొదటగా రాష్ట్రంలో సిద్దిపేటలో నిర్మించామని, ఖేడ్‌లోనూ రూ.20 లక్షలతో భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ మార్కెట్‌యార్డ్ ఆవశ్యకత ఉన్నా గత ప్రభుత్వం లో మార్కెటింగ్ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ యార్డ్ ఏర్పాటు చేయలేదన్నారు.

ఖేడ్ అన్నింటా వెనుకబడిందని గుర్తించి ప్రభుత్వం, 67 ఏళ్లలో జరగని అభివృద్ధిని 67 రోజుల్లోనే చూపించి రెండు మార్కెట్‌యార్డులు, 11 సబ్‌స్టేషన్లు, మనూరులో జూనియర్ కళాశాల, ఖేడ్‌లో 150 పడకలు, కల్హేర్, మనూరులలో 30 పడకల దవాఖానలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు.

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనుక్షణం తపిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఉల్లి, అల్లం, ఆలుగడ్డ సాగు ప్రోత్సహించే దిశగా కంగ్టిలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గాన్ని కరువుప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

English summary
Telangana Minister Harish Rao on Monday responded on Police jobs recruitment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X