• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేళ జయశంకర్ సార్ ను గుర్తు చేసిన హరీష్ రావు .. ఏమన్నారంటే

|

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సంబరంగా జరిగింది . ఇక రాష్ట్రం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబరాల్లో నిమగ్నమైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పని చేసిన హరీష్ రావు మాత్రం ప్రారంభోత్సవ సంబరాలకు దూరంగా ఉన్నారు. గతంలో భారీ నీటి పారుదల శాఖామంత్రిగా పని చేసిన ఆయన ఇప్పుడు మంత్రి కాకపోవటంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ఈ నేపధ్యంలో ఉదయం కాళేశ్వరం ప్రాజెక్ట్ కల సాకారం చేసుకున్న అపర భగీరధుడు కేసీఆర్ కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన హరీష్ రావు, ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే.

  కాళేశ్వరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మహారాష్ట్ర సీఎం
  జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ఆయన్ను గుర్తు చేసుకున్న హరీష్ రావు

  జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ఆయన్ను గుర్తు చేసుకున్న హరీష్ రావు

  ఇక ఈ రోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ వర్థంతి కావటంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమై జాతికి అంకితం అయిన వేళ హరీష్ రావు జయశంకర్ సార ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు . అనంతరం ఆయన స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త జయశంకర్‌ సార్‌ అన్నారు హరీష్ . బంగారు తెలంగాణకు బాటలు చూపిన మహాత్మ అని ఆయన జయశంకర్ సార్ ను కొనియాడారు.

  ఇది శుభదినం.. తెలంగాణ రావడం ఎంతముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకోవడం అంతే ముఖ్యం అని హరీష్ రావు పేర్కొన్నారు.

  ముగిసిన జలసంకల్ప హోమం .. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతికి అంకితం

  జయశంకర్ సార్ వర్ధంతి నాడే కాళేశ్వరం ప్రారంభం కాకతాళీయం అన్న హరీష్

  ఈ రోజు తెలంగాణ ముద్దుబిడ్డ జయశంకర్ సార్ వర్థంతి కావడం నిజంగా కాకతాళీయం అని ఆయన పేర్కొన్నారు. ఇక జయశంకర్ సార్‌ స్ఫూర్తిని చెదరకుండా తమ గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నట్లు తెలిపారు. మన బీళ్లకు గోదావరి నీళ్లను మళ్లించుకుంటున్నామంటే అది జయశంకర్ సార్ కు నిజమైన నివాళి అని హరీష్ రావు పేర్కొన్నారు .ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్ని పెండింగ్ ప్రాజెక్టులుగ మారాయి. కేసీఆర్ వచ్చాక పెండింగ్ ప్రాజెక్టున్ని రన్నింగ్ ప్రాజెక్టులు గా మారాయని పేర్కొన్నారు .కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మాణంలో నాకూ పాత్ర లభించడం ఏ జన్మలోనే చేసుకున్న పుణ్య ఫలం అని ఆయన చెప్పుకొచ్చారు . 20 ప్రాజెక్టుల సమూహం ఈ కాళేశ్వరం అన్న హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో 19 రిజర్వాయర్లు ఉంటాయి. విటి కెపాసిటీ 140 టీఎంసీలని 100 మీటర్ల నుంచి 620 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసే ప్రాజెక్టు ప్రపంచంలో మరేదీ లేదని పేర్కొన్నారు . నిజంగా ఇది ప్రజల విజయం.. తెలంగాణ ఉద్యమ విజయం అని తెలిపారు హరీష్ రావు .

  కేక్ కట్ చేసి సిద్ధిపేట నేతలతో కాళేశ్వరం ప్రారంభోత్సవ సంతోషాన్ని పంచుకున్న హరీష్

  కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే కాళేశ్వరం కల సాకారం అయ్యిందని కితాబిచ్చారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పాలించాయి గాని ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇవ్వ లేదని అప్పటి ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రాజెక్టులను అంతరాష్ట్ర వివాదాలుగా మార్చారని మండిపడ్డారు. పట్టుదల ఉంటే దశాబ్దాలు కాదు సంవత్సరాలోనే ఎంత పెద్ద ప్రాజెక్టు నైనా నిర్మించవచ్చని ఆయన తెలిపారు . ఇన్నేళ్లు సముద్రంలో కలిసే నీటిని మన పంట పొలాల్లోకి మళ్లించుకుంచుకుంటున్నా మన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా కేక్ కట్ చేశారు. సిద్ధిపేట నేతలతో కలిసి కేక్ కట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana theorist Prof. Jayashankar sir has been honored by the former minister and MLA Harish Rao who paid homage to the statue . Harish Rao remembers Jayashankar Sir when the Kaleshwaram project was started and dedicated to the nation.Harish said that Jayashankar Sir was the leader of the Telangana state. He praised Jayashankar Sir as the great mahatma who made the way to the golden Telangana. Harish Rao said that it is important to start the project of Kaleshwaram.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more