• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ ద్రోహనికే హరీష్ రావుకు శిక్ష .... ఎంపీ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్

|
  నన్ను ఓడించినందుకే హరీష్ రావుకి ఈ గతి పట్టింది || Harish Rao Facing Very Bad Situation In TRS

  కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి హరీష్ రావుపై సంచలన వాఖ్యలు చేశారు . కొడంగల్ లోని కోస్గిలో నిర్వహించిన సన్మాన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ లో తన ఓటమి కోసం పని చేసిన హరీష్ రావు గురించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు . అనంతరం మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పనిచేయాలని శ్రేణులకు సూచించారు.

  హరీష్ రావు ద్రోహం చేశారు.. అందుకే శిక్ష అనుభవిస్తున్నారు అన్న రేవంత్

  హరీష్ రావు ద్రోహం చేశారు.. అందుకే శిక్ష అనుభవిస్తున్నారు అన్న రేవంత్

  తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓటమిపాలైన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటీ చేసి ఎంపీగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వదలనని తేల్చి చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, హరీశ్‌లు కొడంగల్‌లో కుట్రలు చేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను ఓడించారని కొడంగల్ ప్రజలకు హరీష్ రావు చేసిన ద్రోహానికే ఆయన ఇప్పుడు పార్టీలో ఉండి కూడా లేనట్టుగా, ప్రాధాన్యత కోల్పోయి శిక్ష అనుభవిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. అక్కడ తనను ఓడించినప్పటికీ.. ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడానికే తనను మల్కాజ్‌గిరిలో గెలిపించారని రేవంత్ తెలిపారు. కేసీఆర్ ను ఎదిరించే వారు లేకుంటే పాలన సరిగా సాగదని నమ్మే తనను గెలిపించారని ఆయన చెప్పారు. .

  కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమే ధ్యేయంగా పని చేసిన హరీష్ పై రేవంత్ హాట్ కామెంట్

  కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమే ధ్యేయంగా పని చేసిన హరీష్ పై రేవంత్ హాట్ కామెంట్

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు కంటే రేవంత్ రెడ్డి ఓటమే ప్రధానంగా హరీష్ రావు కొడంగల్ లో పనిచేసారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులను తమ వైపు తిప్పుకోవడంలో హరీష్ రావు విజయం సాధించారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు తావివ్వకుండా వ్యూహలను రూపొందించారు.రేవంత్ రెడ్డి ఓటమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పావులు కదిపారు. ఎక్కడిక్కడ తన వ్యూహాలను హారీష్ రావు చేత అమలు చేయించారు. దీంతో హరీష్ వల్లే రేవంత్ ఓడిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఇక ఇప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ హరీష్ పై ఈ నేపధ్యంలోనే సంచలన వ్యాఖ్య చేశారు.

  ఎన్నికల సమయంలో కొడంగల్ ప్రజలకు చేసిన ద్రోహానికే శిక్ష

  ఎన్నికల సమయంలో కొడంగల్ ప్రజలకు చేసిన ద్రోహానికే శిక్ష

  ప్రశ్నించేవాడు లేకుండా పాలించేవాడిదే రాజ్యం అవుతుందని కాంగ్రెస్ నేత మల్కాజ్ గిరి లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు తనను ఎన్నికల్లో గెలిపించారని వ్యాఖ్యానించారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ కొడంగల్ ప్రజల ఆదరణ, ప్రేమను మర్చిపోనని స్పష్టం చేశారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడిచేందుకు కేసీఆర్ హరీశ్ రావును పంపారనీ, ఎన్నికల్లో హరీష్ చేసిన ద్రోహానికే శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు హరీశ్ రావు పరిస్థితి ఏమైందో ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. పొట్టివాడ్ని పొడుగువాడు కొడితే, పొడుగువాడిని పోశమ్మ కొట్టిందన్నట్లుగా హరీశ్ పరిస్థితి తయారైందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఇక కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు పని చెయ్యాలని దిశా నిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Revanth Reddy lost as an MLA but won as a MP said that he is not going to leave KCR anymore . He said that KCR sent Harish Rao to defeat him in Telangana Assembly elections and said that Harish is guilty of treachery in the election. Now Harish Rao is in abad situation that people are looking Revant Reddy said that Harish's condition has become like a long-suffering person. He urged people to win congress candidates by a huge majority in the upcoming municipal elections.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more