వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ‌రీష్ రావు వైరాగ్య వ్యాఖ్య‌ల వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఇదేనా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

హ‌రీష్ రావు వైరాగ్య వ్యాఖ్య‌ల వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఇదేనా..?

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నికలు ముందుకు త‌రుముకొస్తున్న తరుణంలో త‌ఢాకా చూపించాల్సిందిపోయి తెలంగాణ తెరాసా నేత‌లు త‌డ‌బ‌డుతున్నారు. సీనియ‌ర్ నేత‌లు ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో ముందుండి సైన్యాన్ని న‌డిపించాల్సింది పోయి నైరాశ్యంతో మాట్ల‌డ‌టం గులాబీ నేత‌లు జీర్నించికోలేక‌పోతున్నారు. భావోద్వేగాల‌ను బాగా అర్థం చేసుకునే తెలంగాణ ప్ర‌జానికం మ‌ద్య‌న హ‌రీశ్ రావు వైరాగ్యంతో చేసిన వాఖ్య‌లు వామ్మో అనిపిస్తున్నాయి. తెలంగాణ సాదించుకున్న ఇంత త‌క్కువ స‌మ‌యంలోనే హ‌రీష్ రావు రాజ‌కీయాల్లో త‌ల‌పండిన వ్రుద్ద నాయ‌కుడిగా ఎందుకు వ్యాఖ్యానించాడ‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిచి కేటీఆర్ ముఖ్య‌మంత్రి ఐతే త‌న పాత్ర నామ‌మాత్ర‌మ‌నే ఉద్దేశంతో హ‌రీష్ రావు ఇలాంటి వ్యాఖ్య‌లు చేసారా ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

హ‌రీష్ వ్యాఖ్య‌ల‌పై పార్టీలో ఆవేద‌న‌..! ఏదో జ‌రుగుతోంద‌ని కార్య‌క‌ర్త‌ల రోద‌న‌..!!

హ‌రీష్ వ్యాఖ్య‌ల‌పై పార్టీలో ఆవేద‌న‌..! ఏదో జ‌రుగుతోంద‌ని కార్య‌క‌ర్త‌ల రోద‌న‌..!!

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏం జరుగుతోంది? పైకి అంతా సవ్యంగా ఉన్నట్లు కన్పిస్తున్నా అంత‌ర్గ‌తంగా ఏదో జరుగుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మధ్య ఏ ఇంటర్వ్యూలో చూసినా మంత్రి హరీష్ రావుకు ఒకే ప్రశ్న ఎదురవుతోంది. కెటీఆర్ సీఎం అయితే ఆయన దగ్గర మంత్రిగా పనిచేయటానికి సిద్ధమా? టీఆర్ఎస్ నిర్మాణంలో పాలుపంచుకున్న హరీష్ రావుకు ఇది సహజంగా ఒకింత ఇబ్బందికర పరిణామమే. అయితే ఆయన మాత్రం తనకు కెసీఆర్ ఆదేశాలే శాసనం అంటూ ప్రతి వేదిక మీదా చెబుతూ వ‌స్తున్నారు. అయినా హరీష్ రావుకు అవమానాలు తప్పటం లేదా అనేది మిలిమ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేస్తూనే ఉంటా..అనే వ్యాఖ్య‌లు దేనికి సంకేతం..?

పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేస్తూనే ఉంటా..అనే వ్యాఖ్య‌లు దేనికి సంకేతం..?

ఎందుకు హరీష్ రావు శుక్రవారం నాడు ఇంత సంచలన వ్యాఖ్యలు చేశారు. వయస్సు పైబడిన నాయకులు కూడా అందరూ ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్న ఈ రోజుల్లో హరీష్ రావు వయస్సు అయిపోయిందని, రాజకీయ నిష్క్రమణ వంటి వ్యాఖ్యలు చేయటం వెనక కారణం ఏంటన్నది టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం విస్తృత చర్చ నడుస్తోంది. సిద్ధిపేట సమీపంలో ఉన్న ఇబ్రహీంపూర్ సమావేశంలో మాట్లాడుతూ మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే ఇలా ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలి అన్పిస్తోంది. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేస్తూనే ఉంటా అని వ్యాఖ్య‌నించ‌డం వెన‌క మ‌ర్మాన్ని వెతుక్కుంటున్నారు గులాబీ నేత‌లు.

పార్టీలో హ‌రీష్ కి త‌గ్గిన ప్రాధాన్య‌త‌..! అందుకే నిరాశ‌..!!

పార్టీలో హ‌రీష్ కి త‌గ్గిన ప్రాధాన్య‌త‌..! అందుకే నిరాశ‌..!!

మీ ఆదరాభిమానాలు చూశాక ఇక రాజకీయాల నుంచి తప్పుకున్నా చాలు అన్పిస్తోంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాబీ నబీ ఆజాద్ టీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిస్తూనే, హరీష్ మరో వైపు ఇంత‌ వేదాంత ధోర‌ణిలో ఎందుకు మాట్లాడారు అనే చర్చ సాగుతోంది. అంతే కాదు, ప్రస్తుతం పూర్తి అనుకూలంగా ఉండే అధికారిక పత్రిక, ఛానల్ లో కూడా హరీష్ రావుకు ప్రాధాన్య‌త‌ను భారీగా త‌గ్గించిన‌ట్టు ప్రచారం జరుగుతోంది. హ‌రీష్ రావు అదికారిక కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను కూడా ఆయా మీడియాలో స‌రైన గుర్తింపు రాక‌పోవ‌డంతో హ‌రీష్ అనుచ‌రులు అమోమ‌యం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్న క్యాడ‌ర్..! ప‌ర్య‌వ‌సానాల‌పై న‌జ‌ర్..!

హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్న క్యాడ‌ర్..! ప‌ర్య‌వ‌సానాల‌పై న‌జ‌ర్..!

దీనికి తోడు తాజాగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మాత్రం టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే అనుమానాలు రేకెత్తిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సీఎం పీఠంపై కెటీఆర్ ను కూర్చోపెట్టి, కెసీఆర్ ఢిల్లీ వైపు వెళతారని ప్రచారంలో ఉంది. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన కొండా సురేఖ కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పారు. రాబోవు ముంద‌స్తు ఎన్నిక‌లు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో కేటీఆర్ కోస‌మే నిర్వ‌హిస్తున్న‌ట్టు గులాబీ పార్టీలో మ‌రో వ‌ర్గం నేత‌లు నిర్ధారిస్తున్నారు. ఇదే జ‌రిగితే హ‌రీష్ వాఖ్య‌ల వెన‌క అర్థం, ప‌ర‌మార్థం ఉన్న‌ట్టే న‌ని పెద్ద‌యెత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

English summary
trs senior leader hareesh rao comments brought agony in the party. his comments kept party cadre into pandemonium. how ever trs cadre not ready to listen such comments from hareesh rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X