వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీని 300 మీటర్ల లోతులో పాతేయండి, తిమ్మాపూర్ ప్రచారంలో హరీశ్ రావు ఫైర్

|
Google Oneindia TeluguNews

మరో నాలుగురోజుల్లో దుబ్బాక ప్రచార పర్వానికి తెరలేవనుంది. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలు మరింత ముమ్మరమైంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆరోపణలు-ప్రత్యారోపణలతో ప్రచార పర్వం మరింత హీటెక్కింది. హరీశ్ రావు-డీకే అరుణ, రఘునందన్ రావు మధ్య మాటలు అగ్గిరాజేస్తున్నాయి. ప్రజలకు చేసిన సంక్షేమ పనులపై సవాళ్లు కొనసాగుతున్నాయి.

అన్నీ తానై..

అన్నీ తానై..

దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్ఎస్ తరఫున భుజాలపై వేసుకొన్న మంత్రి హరీశ్ రావు ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఏ చిన్న గ్రామాన్ని వదలకుండా క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు కొనసాగుతున్నాయి. దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో హరీశ్ రావు ప్రచారం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీటర్లకు మోటార్లు బిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. మీటర్లు బిగిస్తానంటోన్న బీజేపీని.. 300 మీటర్ల లోతులో పారేయాలని కోరారు.

ఓటుతోనే సమాధానం..

ఓటుతోనే సమాధానం..

రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి తగిన సమాధానం చెప్పాలని హరీశ్ రావు కోరారు. బీజేపీ చేస్తోన్న కుటిల యత్నాలను ప్రజలను గమనించాలన్నారు. ఈ మేరకు తమ తీర్పును ఇవ్వాలని విన్నవించారు. బీజేపీని గెలిపిస్తే వారు చెప్పిన మీటర్ల బిగింపు.. ఇతర వ్యతిరేక విధానాలు కొనసాగిస్తారని చెప్పారు. మీకు సంక్షేమ పథకాలు/ విధానాలు కావాలో.. రైతు వ్యతిరేక విధానాలు కావాలో నిర్ణయించుకోవాలని హరీశ్ రావు సూచించారు. దీనిపై విజ్ఞులైన దుబ్బాక వయోజనులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సజెస్ట్ చేశారు.

మరీ స్వదేశీ మక్కల సంగతి

మరీ స్వదేశీ మక్కల సంగతి


విదేశీ మక్కలను తీసుకొస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇక్కడి ధాన్యం ఏం కావాలి.. ఇదీ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం కాదా అన్నారు. మార్కెట్లను ప్రైవేటీకరంచడంతో పాటు పలు నిర్ణయాలతో రైతులకు నష్టం కలుగుతోందని చెప్పారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా నష్టం కలిగిస్తున్నారని తెలిపారు.

Recommended Video

Dubbaka Bypoll 2020 : Jaggareddy On Harish Rao ముంపు గ్రామాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది..
రూ.2500 కోట్లు ఇస్తామని ఆఫర్..

రూ.2500 కోట్లు ఇస్తామని ఆఫర్..


నూతన వ్యవసాయ చట్టంతో ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని.. వాడిన కరెంట్ లెక్కతీసి బిల్లులు ఇవ్వనుంది. మోటార్లకు మీటర్లు బిగిస్తే రూ.2500 కోట్లు ఇస్తామని మే 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసిందని హరీశ్ రావు గుర్తుచేశారు. రైతుల శ్రేయస్సు ముఖ్యమని భావించినా ముఖ్యమంత్రి కేసీఆర్.. దానికి తిరస్కరించారని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై టీఆర్ఎస్ కూడా ఆందోళన చేపట్టబోతుందని తెలిపారు.

English summary
finance minister Harish rao slams bjp for electricity motors issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X