వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై తెలంగాణ భగ్గు: జీఎస్టీ బకాయి చెల్లించకపోవడంపై హరీశ్ రావు ఫైర్

|
Google Oneindia TeluguNews

వస్తు సేవల పన్ను బకాయిలను కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. జీఎస్టీ బకాయిలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. జీఎస్టీ చట్టంలో పండమిక్ యాక్ట్‌, కరోనా యాక్ట్ లాంటి ఏ ఇతర యాక్ట్‌లు లేవన్నారు. రాష్ట్రాలకు సెస్‌ చెల్లించమంటే ఎలా అని, అటార్నీ జర్నల్ ప్రకారం లీగల్‌గా అయిన ఏ విధంగా అయిన రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు.

Recommended Video

Srisailam ప్రమాద ఘటనలో 9 మంది మృతి...!! 50 లక్షలు, రూ. 25 లక్షల చొప్పున CM KCR ఆర్థిక సాయం!
harish rao slams central government on gst

కరోనా వైరస్ ఉందని.. జీఎస్టీ ఇవ్వమంటే కుదరదని తేల్చిచెప్పారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోదని స్పష్టం చేశారు. కరోనా అనేది ఒక్క కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాదని, అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కరోనాతో అన్ని రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోయావని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదుకోవాన్నారు. మూడేళ్లలో తెలంగాణ నుంచి 18 వేల 32 కోట్లయితే రిటర్న్ వచ్చింది మాత్రం రూ.3,200 కోట్లు మాత్రమే అని తెలిపారు.

కరోనా వైరస్ వల్ల రాష్ట్రం 34 శాతం ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీలో విస్తృతమైన అధికారులు ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. జీఎస్టీ సెజ్‌ను తగ్గించడాన్నిరాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని అన్నారు. చట్టానికి లోబడే రాష్ట్రాలకు జీఎస్టీ సెజ్ ఇవ్వాలని తెలిపారు. జీఎస్టీ అంశంపై ఆరు రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశంలో కూడా చర్చించామని పేర్కొన్నారు.

English summary
telangana minister harish rao slams central government on gst.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X