సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో హరీష్ రావు.. ఆయన తీరు మారిందంటూ కామెంట్స్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ పాత్ర ఎంత ఉందో.. ఆయన మేనల్లుడు హరీష్ రావు పాత్ర కూడా అంతే ఉంది. మామ నడిచిన దారిలో వినమ్రంగా అడుగులేసిన హరీష్ రావు.. మామ సంపాదించుకున్న పేరు లాగే ఆయన కూడా ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కేసీఆర్ అల్లుడిగానే కాదు.. వ్యక్తిగతంగా ఆయన క్రేజ్ వేరు.

సాయం కోసం ఆయన ఇంటికెళ్తే.. ప్రతి ఒక్కరిని కలుస్తారు, వీలైనంత మేర సాయం చేస్తారు. అందుకే ఆయనంటే జనాల్లో ప్రత్యేకమైన అభిమానం. నవ్వుతూ ఉండటమే తప్ప చీదరించుకోవడం తెలియని హరీష్ రావు కొద్దిరోజులు కనిపించకుంటే చాలు.. ఏదో జరిగిపోతుందనే వార్తలు రావడం సాధారణం. అదే క్రమంలో ఆయన అమెరికా పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

హరీష్ రావు సైలెంట్‌గా ఏమి లేడు.. ఏం చేస్తుండో నిన్న బయటపడిందిగా..!హరీష్ రావు సైలెంట్‌గా ఏమి లేడు.. ఏం చేస్తుండో నిన్న బయటపడిందిగా..!

అమెరికాలో హరీష్ రావు స్పీచ్

అమెరికాలో హరీష్ రావు స్పీచ్

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అమెరికా పర్యటనకు వెళ్లారు. అందులోభాగంగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో ఫ్లోరిడా రాష్ట్రం ట్యాంపా సిటీలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడిన హరీష్ రావు.. తెలంగాణ ఉద్యమంలో సహకరించారు.. తెలంగాణ అబివృద్దిలో పాలుపంచుకుంటున్నారు. ఇకపై కూడా తెలంగాణ కోసం మీవంతు సహాయసహకారాలు అందించడని కోరారు.

టైమ్ మేనేజ్ మెంట్, కమిట్ మెంట్, హార్డ్ వర్క్‌తో నైపుణ్యం కనబరుస్తున్నారని.. ఇంత దూరం వచ్చినా కూడా మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా మీ కట్టుబాట్లు చూస్తే ముచ్చటేస్తోందని అన్నారు. మన దగ్గర మాత్రం అక్కడక్కడా కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ఏవిధంగా చూసినా మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో స్థిరపడతామంటే సహకరిస్తాం

తెలంగాణలో స్థిరపడతామంటే సహకరిస్తాం

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని చెప్పుకొచ్చిన హరీష్ రావు.. ఎన్ఆర్ఐలు తెలంగాణ సమాజానికి సేవలు అందించాల్సిన అవసరముందన్నారు. మీరు ఎక్కడున్నా సరే తెలంగాణకు మంచి గుర్తింపు దక్కేలా నైపుణ్యం కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో మంచి టెక్నోక్రాట్స్ ఎవరంటే.. తెలంగాణ వారనే పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

మీరు తెలంగాణకు వచ్చి స్థిరపడతామంటే ఎలాంటి సాయమైనా చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్లు గానీ, టెక్నోక్రాట్స్ గానీ, ఐటీ కంపెనీలు స్థాపించాలన్నా.. ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పాజిటివ్ ట్రెండ్ ఉందని.. పెట్టుబడులకు అనుకూలంగా అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని గుర్తు చేశారు.

అప్పటికీ, ఇప్పటికీ మారిపోయారుగా..

అప్పటికీ, ఇప్పటికీ మారిపోయారుగా..

ఉద్యమం నాటి హరీష్ రావుకు, ఇప్పటి హరీష్ రావుకు తేడా ఉందని ఇక్కడి ఆంధ్ర మిత్రులు తనతో నేరుగా మాట్లాడటం సంతోషం కలిగించిందన్నారు. ఆ సమయంలో తనపై అభిప్రాయం వేరేలా ఉండేదని.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూసి మీరు సరైన రూట్‌లో వెళుతున్నారని ప్రశంసించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ అంటూ బేధాభిప్రాయాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉందామని హరీష్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగువారిగా కలిసుందామని అన్నారు. మనమంతా భారతీయులమనే విషయం గుర్తుపెట్టుకోవాలని కోరారు.

వ్యవసాయ రంగానికి మంచి రోజులు

వ్యవసాయ రంగానికి మంచి రోజులు

తెలంగాణలో అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగం కూడా దినదినాభివృద్ధి చెందుతోందని తెలిపారు. 2010లో నేనిక్కిడకు వచ్చినప్పుడు మన దేశంలో రెండు ప్రాంతాలు అన్నదాతల ఆత్మహత్యలతో ఘోషించేవని చెప్పుకొచ్చారు. ఒకటి మహారాష్ట్రలోని విదర్భ కాగా, మరొకటి మన తెలంగాణ ప్రాంతమని తెలిపారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఐదేళ్లలో తెలంగాణలో ఆత్మహత్యలు బాగా తగ్గాయని చెప్పారు.

తెలంగాణలో వ్యవసాయం అంటే దండగ అనే పరిస్థితి నుంచి పండగ అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఐఐటీ చదువుకున్నోళ్లు సైతం వ్యవసాయం దిశగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు. మూడు నాలుగేళ్లలో వ్యవసాయం లాభసాటిగా మారే అవకాశముందన్నారు. అమెరికా వెళ్లి ఐటీ ఇంజినీర్ ఎంత సంపాదిస్తారో.. మన తెలంగాణలో కూడా రైతు అదే స్థాయిలో సంపాదించే దిశగా వ్యవసాయం అభివృద్ధి సాధించనుందని చెప్పారు. రైతంటే చిన్న చూపు ఉన్న క్రమం నుంచి.. వారిని గౌరవించే దిశగా పరిస్థితి మారుతుందన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.

English summary
Harish Rao Ultimate Speech at USA Florida. He attracted NRIs with his speech. If NRIs come to telangana for establish any firms or industries, the trs government will help them says harish rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X