వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులు చేతులెత్తేసినా...: మామ యాగం, హరీష్ రావు హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ సీఎం కెసిఆర్ ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ యాగకర్త కాగా.. యాగశాలలో కెసిఆర్ అల్లుడు, మంత్రి హరీష్ రావు బిజీబిజీగా గడుపుతున్నారు.

ఆయన క్షణం తీరిక లేకుండా భక్తులకు ఎవరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సర్వం తానై నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

హరీష్ రావు... అతిథులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి లోపలకు ఆహ్వానిస్తున్నారు. భక్తుల తాకిడి పెరిగిపోయి రద్దీ ఎక్కువ అయి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వెంటనే అక్కడ వాలిపోతున్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

సమస్యను పరిష్కరించి భక్తులు శీఘ్రంగా దర్శనం చేసుకునేలా చేస్తున్నారు. యాగశాలలో కెసిఆర్ పూజలు చేస్తుంటే, యాగశాల బయట హరీష్ రావు అన్నీ తానై పర్యవేక్షిస్తున్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఉదయాన్ని గోపూజ, గురు ప్రార్థన నుంచి హోమాలు చేయడం.. మధ్యమధ్యలో ప్రముఖులు వచ్చినప్పుడు వారిని సాదరంగా ఆహ్వానించడం, రిత్విజులు, ఇతరుల యోగక్షేమాలను కెసిఆర్ చూసుకుంటున్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం


యాగస్థలి ప్రధాన ద్వారం నుంచి ప్రముఖులను యాగశాల వరకూ తీసుకు వెళ్లే బాధ్యతను హరీష్ రావు తీసుకుంటున్నారు. రెండో రోజు నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో హరీష్ రావు జనాల మధ్యలోకి వెళ్లి పర్యవేక్షిస్తున్నారు. నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం


పోలీసులు చేతులు ఎత్తేసిన సమయంలోను హరీష్ రావు రంగంలోకి దిగి భక్తుల క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఆయన మైక్ పట్టుకొని క్యూ లైన్లలోని భక్తుల్లో ఉత్సాహం నింపారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

భక్తులు పెరగగానే హరీష్ రావు మైకు తీసుకొని.. త్వరితగతిన క్యూలైన్లలోని భక్తులు బయటకు వెళ్లాలంటూ సూచించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

యువతీ, యువకులు సెల్ఫీలతో కాలయాపన చేస్తున్న సమయంలో... భద్రకాళీకి కోపం వస్తుందని, సెల్ఫీలు దిగకుండా అమ్మవారి జపంతో ముందుకు కదలాలని హరీష్ రావు సూచించారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

శనివారం యాగస్థలి వద్ద గంటగంటకూ భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతుండటంతో యాగశాల బయట పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

హరీష్ రావు మైక్‌లో పదేపదే విజ్ఞప్తులు చేస్తూ రద్దీని క్రమబద్దీకరించారు. శనివారం ఉదయం నుంచే యాగస్థలికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నానానికి రద్దీ భారీగా పెరిగింది. దీనితో హరీశ్ రావు కలుగచేసుకుని మైక్ చేతబట్టి భక్తులను ముందుకు నడిపించారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

లక్షల మంది జనం బయట క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారని, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. వృద్ధులు, చంటిబిడ్డల తల్లులు, మన ఆడబిడ్డలు ఎండలో ఉన్నారని, మీరెంత ఆలస్యం చేస్తే యాగశాల బయట ఉన్న భక్తులు అంత ఇబ్బంది పడతారని హరీష్ రావు పదేపదే మైకులో చెప్పారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

మన పోలీసులు టిఫిన్లు, భోజనాలు, మంచినీళ్లు లేకుండా కష్టపడుతున్నారని, దయచేసి సహకరించాలని భక్తులను హరీష్ రావు ఎప్పటికప్పుడు కోరారు.

 ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

యాగశాల వద్ద ఫొటోలు దిగుతున్న భక్తులను అన్నా దండం పెడతా, సెల్పీలు వద్దు.. ఫోటోలు తర్వాత తీసుకుందాం అంటూ సున్నితంగా వారించారు. కొన్ని సందర్భాల్లో సరదాగా మాట్లాడుతూ భక్తులను ఆకట్టుకున్నారు.

English summary
Telangana Minister Harish Rao very busy at Chandiyagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X