హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాక్‌గార్డెన్ చెరువులో బోటింగ్: హరీశ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చెరువులను కబ్జా చేసే వారిని జైలుకు పంపే విధంగా శాసన సభలో కొత్తగా చట్టాన్ని తయారు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి గురువారం బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కు, రోడ్ నం. 12లోని లోటస్‌పాండ్, ఫిలింనగర్ ఫేజ్ 3లోని రాక్‌గార్డెన్ చెరువులను హరీశ్‌రావు సందర్శించారు.

వెంగళరావు పార్కులోని చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. పార్కులో లైబ్రరీని ఏర్పాటు చేస్తే వాకర్లకు సౌకర్యంగా ఉంటుందని కొందరు కోరగా, దీనికి మంత్రి తక్షణమే అంగీకరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన మిషన్ కాకతీయలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని చెరువులను కూడా అభివృద్ధి చేయనున్నామన్నారు.

గుర్రపు డెక్క ఆకువల్ల నగర చెరువుల్లోని నీరంతా కప్పుకుపోతున్నదని అన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని దాల్‌లేక్‌లో గుర్రపుడెక్క ఆకును తొలగించేందుకు ఉపయోగించిన ప్రత్యేక యంత్రాన్ని తెప్పించి నగరంలోని చెరువుల్లో ఉపయోగిస్తున్నామన్నారు.

ఇప్పటికే మల్కాజిగిరిలోని చిన్నరాయిని చెరువులో దానిని ప్రయోగాత్మకంగా పరీక్షించి ఆకును తొలగించామని తెలిపారు. నగరంలో 30 చెరువులను మినీ ట్యాంక్‌బండ్లుగా, వాకింగ్ ట్రాక్‌లుగా అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. రాక్‌గార్డెన్ చెరువులో కొందరు అక్రమంగా మట్టిని డంపింగ్ చేస్తున్న విషయాన్ని గమనించిన మంత్రి, తక్షణం అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు.

చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు పచ్చదనం పెంచాలన్నారు. అనంతరం లోటస్‌పాండ్‌కు వచ్చిన మంత్రులు అక్కడున్న వాకర్లతో ముచ్చటించారు. చెరువు కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో చెత్తను డంపింగ్ చేయడంతో పాటు నాలా ప్రవహిస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోందని వాకర్లు ఫిర్యాదు చేయగా.. ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, నాలాను నిర్మించి పార్కులో పచ్చదనాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.

హరీశ్, నాయిని

హరీశ్, నాయిని

చెరువులను కబ్జా చేసే వారిని జైలుకు పంపే విధంగా శాసన సభలో కొత్తగా చట్టాన్ని తయారు చేస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

హరీశ్, నాయిని

హరీశ్, నాయిని

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి గురువారం బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కు, రోడ్ నం. 12లోని లోటస్‌పాండ్, ఫిలింనగర్ ఫేజ్ 3లోని రాక్‌గార్డెన్ చెరువులను హరీశ్‌రావు సందర్శించారు.

హరీశ్, నాయిని

హరీశ్, నాయిని

వెంగళరావు పార్కులోని చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు.

హరీశ్, నాయిని

హరీశ్, నాయిని

ఎన్నో ఏళ్లుగా ఆదరణకు నోచుకోని పార్కులోని చెరువును పునరుద్ధరిస్తుండటం పట్ల వాకర్లు ఆనందం వ్యక్తం చేశారు.

హరీశ్, నాయిని

హరీశ్, నాయిని

పార్కులో లైబ్రరీని ఏర్పాటు చేస్తే వాకర్లకు సౌకర్యంగా ఉంటుందని కొందరు కోరగా, దీనికి మంత్రి తక్షణమే అంగీకరించారు.

హరీశ్, నాయిని

హరీశ్, నాయిని

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన మిషన్ కాకతీయలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని చెరువులను కూడా అభివృద్ధి చేయనున్నామన్నారు.

English summary
Telangana Ministers Harish Rao and Naini Narsimha Reddy on Thursday visited Vengal Rao Park in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X