• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాళేశ్వరం పై రగిలిపోతున్న హరీశ్ అనుచరులు..! జీవం లేని ప్రారంభోత్సవం అంటున్న ఫాన్స్..!!

|
  కేసీఆర్ పై రగిలిపోతున్న హరీశ్ రావ్ అనుచరులు..! || Oneindia Telugu

  హైదరాబాద్ : రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉండవు. వ్యక్తిగత హననాలు మాత్రమే ఉంటాయి. అంటే స్వయంకృతాపరాథం అన్నమాట. ఏపీలో చంద్రబాబుకు జరిగిందిదే. అక్కడ టీడీపీ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పడు, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఆత్మహత్య వైపుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నెడుతున్నారా...? అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. నిన్నట్టి వరకు కాలేశ్వరం ప్రాజెక్టుకు కాపాలా దారుడాగా ఉంటూ, ఎండనక వాననకు, గుడారాల్లో నిద్రపోయి ప్రాజెక్టుకు ఓ రూపం తెచ్చిన హరీష్ ను చంద్రశేఖర్ రావు పక్కన పెట్టి ప్రారంభోత్సవం చేయడం హరీష్ అనుచరులు జీర్నించుకోలేక పోతున్నారు.

  యావత్ తెలంగాణ వాదులు ఇదే అంశంపై పెద్ద యెత్తున నిరసన తెలిపేందుకు సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. కనీసం మర్యాదపూర్వకంగా నైనా హీరీష్ ను పక్కన పెట్టుకొని ఉండాల్సిందని తెలంగాణ వాదులు అభిప్రాయ పడుతున్నారు. ఇక హరీష్ అనుచరులలైతే నిన్న జరిగిన పరిణామాల పట్ల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు తెలుస్తోంది.

   కాలేశ్వరానికి హరీష్ దూరం..!కేసీఆర్ పై తెలంగాణ వాదుల ఆగ్రహం..!!

  కాలేశ్వరానికి హరీష్ దూరం..!కేసీఆర్ పై తెలంగాణ వాదుల ఆగ్రహం..!!

  రాజకీయాల్లో ఏం జరిగినా, ఏది జరిగినా... దాని వెనుక, బయటకు కనిపించని కారణాలెన్నో ఉంటాయి. తెలంగాణ ఏర్పాటనేది చంద్రశేఖర్ రావు దీక్షతోనో, పోరాటంతోనో మాత్రమే రాలేదు. కాంగ్రెస్ హస్తం కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. బీజేపి ఊహాంచని ఆదిక్యం, జగన్ చారిత్రక విజయం... ఒక్క రోజులో జరిగిపోలేదు. వాటి వెనుక కొనేనళ్లపాటు సాగిన అనేకానేక పరిణామాలు ఉన్నాయి. రాజకీయాల్లో తెలిసి చేసిన తప్పులను ప్రజలు ఎప్పటికి క్షమించరని అనేక ఉదాహరణలు సాక్షాత్కరిస్తున్నాయి. పలానా వారి ఉనికి ఉండకూడదని ఆశించటం అత్యాశే అవుతుంది. టీఆర్ఎస్ కనిపించకూడదన్న కసితో దానిపై రాజకీయంగా జరిగిన దాడులు ఎన్నెన్నో. దెబ్బ పడిన ప్రతిసారీ బలోపేతమైన పార్టీ అది. ఎందుకంటే.. ఆ పార్టీ నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర సాధనను కోరుకుంది. ఆ లక్ష్యం తప్పించి మరింకేమీ లేదు. అదే ఆ పార్టీకి వరమైంది.

  హరీష్ ను ఆహ్వానించకపోవడానికి కారణం ఏంటి..! కేసీఆర్ వ్యూహం ఏంటి..!!

  హరీష్ ను ఆహ్వానించకపోవడానికి కారణం ఏంటి..! కేసీఆర్ వ్యూహం ఏంటి..!!

  అప్పటి టీఆర్ఎస్ కు ఇప్పటి టీఆర్ఎస్ కు పోలిక లేదన్నది తెలంగాణ వాదుల నోట వినిపిస్తూ ఉంటుంది. చంద్రశేఖర్ రావు లాంటి తిరుగులేని అధినేత పార్టీకి అండగా ఉన్నప్పుడు అసంతృప్తి జ్వాలలకు అవకాశం ఉంటుందా.. ఉండదు, ఉండకూడదు. కానీ, తద్విరుద్ధంగా చంద్రశేఖర్ రావు మీద అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇదొక ప్రమాద సంకేతం. వీటిని పట్టించుకునే పరిస్థితుల్లో చంద్రశేఖర్ రావు లేరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవమే దీనికొక మంచి ఉదాహరణ. ఒక భారీ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో లేవు. నీటి కొరత ఎక్కువగా ఉండే తెలంగాణలో నీళ్లను చూస్తే.. తెలంగాణ వాసులు అదోలాంటి ఆనందంతో ఉక్కిరిబిక్కరవుతారు. అలాంటి చోట బాహుబలి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ల్యాండ్ మార్క్ లాంటిది. దాన్ని పూర్తి చేసిన చంద్రశేఖర్ రావు ను మర్చిపోలేరు.

  హరీష్ పై పెరుగుతున్న సానుభూతి..! కేసీఆర్ వ్యవహారంపై నిప్పులు చెరుగుతున్న ఫాన్స్..!!

  హరీష్ పై పెరుగుతున్న సానుభూతి..! కేసీఆర్ వ్యవహారంపై నిప్పులు చెరుగుతున్న ఫాన్స్..!!

  అయితే.. ఇంతటి బృహత్కర కార్యాన్ని పూర్తి చేసిన చంద్రశేఖర్ రావు.. ఆ పని పూర్తి చేయటంలో నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసిన హరీశ్ రావును పక్కన పెట్టేసిన తీరు గులాబీ పార్టీలో అంతర్గత చర్చకు, ఆగ్రహానికి కారణమవుతోంది. హరీశ్ అభిమానుల్లో, ఆరాధకుల్లో క్రోదావేశం కట్టులు తెంచుకునేంతగా పరిణమించింది. వారిని కదిలిస్తే చాలు.. తమ నేతకు జరిగిన మోసాన్ని వారు అదే పనిగా చెబుతున్నారు. కాకుంటే.. చంద్రశేఖర్ రావు బలాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకపోవటంతో తమలో తాము రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.

   దీర్ఘకాలిక రాజకీయాల్లో మచ్చగా మిగిలిపోనుందా..! హరీష్ ప్లాన్ ఏంటి..?

  దీర్ఘకాలిక రాజకీయాల్లో మచ్చగా మిగిలిపోనుందా..! హరీష్ ప్లాన్ ఏంటి..?

  కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని ఎలా అవుతుందో.. ఈ ప్రాజెక్టు మోసానికి.. నమ్మకద్రోహానికి.. విశ్వాసంగా పని చేసిన వారి పట్ల నిర్దయగా వ్యవహరించిన వైనానికి నిలువెత్తు రూపంగా నిలుస్తుందని వారు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి భవిష్యత్తులో చోటు చేసుకునే ఎన్నో పరిణామాలకు కాళేశ్వరం ప్రాజెక్టు కీలకం కానున్నదన్న మాట వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు.. చంద్రశేఖర్ రావు కు వరంగా మారుతుందా? శాపంగా మారుతుందా...? దీనికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదు, కాలం మాత్రమే అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.

  English summary
  Harish's followers have been unable to digest the inauguration of Chandrasekhar Rao, who has been a guardian of the Kaleshvaram project till yesterday, and has given a look to the project by sleeping in the rain. All the Telangana people seem to be preparing to protest the same. Telanganaists feel that at least respectfully Hirish should be sidelined.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more