వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ షిఫ్ట్ చేసుకున్న హ‌రీష్..! కొడంగ‌ల్ టు గ‌జ్వేల్..! మామ గెలుపే అల్లుడి ల‌క్ష్యం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ రాకీయాలు వేడెక్క‌డంతో పాటు ముఖ్య‌నేత‌ల ల‌క్ష్యాలు కూడా గ‌మ్మ‌త్తైన మ‌లుపులు తీసుకుంటున్నాయి. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఓడించడంలో కీల‌క పాత్ర పోషించే అదికార పార్టీ ముఖ్య‌నేత‌లు అంతే స్థాయిలో వ్యూహాలు కూడా ర‌చిస్తుంటారు. నిన్న‌టి వ‌ర‌కూ కొడంగ‌ల్ లో కాంగ్రెస్ పార్టీనేత రేవంత్ రెడ్డిని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా చ‌క్రం తిప్పిన మంత్రి హ‌రీష్ రావు మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌జ్వేల్ పై ద్రుష్టి సారించారు.

గ‌జ్వేల్ లో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో వంటేరు ప్ర‌తాప్ రెడ్డిని నిలువ‌రించేందుకు ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. త‌న మామ‌, ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావును గెలిపించేంద‌కు ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డి ఓడినా, గెలిచినా పెద్ద తేడా ఉండ‌దు గాని, గ‌జ్వేల్ లో చంద్ర‌శేఖ‌ర్ రావు ఓడిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌ని భావించిన గులాబీ పార్టీ ల‌క్ష్యాన్ని మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో కొడంగ‌ల్ సేఫ్ జోన్ లోకి రాగా గ‌జ్వేల్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ మొద‌లైంది.

 తెలంగాణ‌లో వేడెక్కిన రాజ‌కీయం..! వ్యూహం మార్చుకున్న అదికార పార్టీ..!!

తెలంగాణ‌లో వేడెక్కిన రాజ‌కీయం..! వ్యూహం మార్చుకున్న అదికార పార్టీ..!!

ముందస్తుకు సమయం దగ్గరవుతున్నకొద్దీ పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూ వెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-మహాకూటమి మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుందోగానీ, మైండ్ గేమ్‌లో మాత్రం మహాకూటమిదే విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల మహాకూటమిలోని పార్టీలకు సంబంధించిన ఇద్దరు నాయకులు టీఆర్ఎస్‌లోని బాడా నేతను టార్గెట్ చేయడం, దీంతో ఆ నేత వీరి ఉచ్చులో పడిపోవడం జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ మాత్రం సేఫ్ అయ్యారని తెలుస్తోంది.

మ‌హాకూట‌మి మైండ్ గేమ్..! ఇరుక్కున అదికార పార్టీ..!!

మ‌హాకూట‌మి మైండ్ గేమ్..! ఇరుక్కున అదికార పార్టీ..!!

అసలు విషయానికొస్తే, ఇటీవల టీఆర్ఎస్ ముఖ్య నేత, మంత్రి హరీశ్ రావు హాట్ టాపిక్‌గా మారారు. కాంగ్రెస్‌కు చెందిన వంటేరు ప్రతాపరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి.. హరీశ్ గురించి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. గజ్వేల్‌లో పోటీ చేయనున్న కేసీఆర్‌ను ఓడించేందుకు హరీశ్ ప్రయత్నాలు చేశారని, తనకు ఆర్థిక సహాయం కూడా చేస్తానన్నారని వంటేరు బాంబు పేల్చారు. దీనికి తోడు రేవూరి కూడా కేసీఆర్, హరీశ్‌ను చిన్న చూపు చూస్తున్నారని, దమ్ముంటే ఆయనను వారసుడిగా ప్రకటించాలని గులాబీ బాస్‌కు సవాల్ విసిరారు.

గ‌జ్వేల్ లో వంటేరు ప్ర‌తాపం..! నిలువ‌రిస్తామంటున్న హ‌రీష్ రావు..!!

గ‌జ్వేల్ లో వంటేరు ప్ర‌తాపం..! నిలువ‌రిస్తామంటున్న హ‌రీష్ రావు..!!

వీళ్ల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అంతేకాదు, టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి కూడా. దీంతో హరీశ్, కేటీఆర్ సహా పలువురు మీడియా ముందుకొచ్చి రేవూరి, వంటేరు వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ఇక హరీశ్ అయితే ఈ ఆరోపణలను తిప్పి కొడుతూనే, గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపిస్తానని చెప్పారు. వంటేరు దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, ఆయనకు డిపాజిట్ కూడా దక్కకుండా చూస్తానని అన్నారు. ఇక అప్పటి నుంచి గజ్వేల్‌పైనే టార్గెట్ పెట్టారు హ‌రీష్ రావు. అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ, మహాకూటమి ఆడిన మైండ్ గేమ్‌లో మాత్రం బాగా వ‌ర్కౌట్ అయిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కొడంగ‌ల్ లో తిరుగులేని రేవంత్ రెడ్డి..! ఇక గెలుపే త‌రువాయి..!!

కొడంగ‌ల్ లో తిరుగులేని రేవంత్ రెడ్డి..! ఇక గెలుపే త‌రువాయి..!!

మ‌రో విషయం ఏమిటంటే, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డికి ఈ పరిణామం బాగా కలిసొచ్చింది. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రేవంత్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ చాలా వ్యూహాలు ర‌చించింది. అక్కడ బలమైన అభ్యర్థిని దించడంతో పాటు, మంత్రి హరీశ్‌కు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు చంద్ర‌శేఖ‌ర్ రావు. దీంతో రేవంత్ అభిమానులు కొంత ఉత్కంఠ‌త‌కు గురయ్యారు. ఇప్పుడు హరీశ్ టార్గెట్ గజ్వేల్‌కు షిఫ్ట్ అవడంతో కొడంగల్‌ను వదిలేసినట్లేననే టాక్ వినిపిస్తోంది. దీంతో రేవంత్ విజయం నల్లేరుపై నడకేనని రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ జరుగుతోంది.

English summary
In Kodangal, Revant Reddy winning is not a big issue than KCR winning in Gajwel. If Chandrasekhar Rao is lost in Gajwel, it seems that the bad indications goes through out Telangana.Thats why Haressh targeted Gajwel constituency instead of Kodangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X