వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌జాప్ర‌తినిదులు ప‌నితీరు మార్చుకోక పోతే క‌ఠిన నిర్న‌యాలు త‌ప్ప‌వు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతు బంధు' పధకం ప్రారంభించిన తర్వాత చేప‌ట్టిన సర్వేలో ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌తికూల ఫలితాలు రావటం అధికార పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. కెసీఆర్ అసలు పరిస్థితి గ్రహించే పెద్ద‌యెత్తున ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు ప్రకటిస్తూ రైతులు..ప్రజలను ఆకర్షించే పనిలో ఉన్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయినా కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవటం సీయంవో వ‌ర్గ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.

ప‌థ‌కాల అమ‌లులో దేశానికే ఆద‌ర్శం.. అయినా ప్ర‌జలు వ్య‌తిరేకం..

ప‌థ‌కాల అమ‌లులో దేశానికే ఆద‌ర్శం.. అయినా ప్ర‌జలు వ్య‌తిరేకం..

ఆకాశ‌మే హ‌ద్దుగా ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌క‌ట‌న‌, ల‌క్ష ఎక‌రాల‌కు నీరందించే క్ర‌మంలో అలుపెర‌గ‌ని శ్ర‌మ‌. తెలంగాణ లో ఏ ఒక్క రైతూ ఆత్మహ‌త్య వైపు ఆలోచించొద్ద‌ని రైంతు బంధు ప‌థ‌కం రూపంలో పెట్టుబ‌డి సాయం.. పొర‌పాటున రైత‌న్న ప్రాణాల‌కు హాని జ‌రిగితే ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత భీమా, పేద ప్ర‌జానికానికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు.. వెన‌క బ‌డిన వ‌ర్గాల నిరు పేద‌ల‌కు మూడెక‌రాల భూమి.. ఉచిత విద్య‌, క‌ళ్యాణ ల‌క్ష్మీ, గ‌ర్బిణీ స్త్రీల‌కు కేసీఆర్ కిట్టు, ఇంటింటికి న‌ల్లా, వ్రుద్యాప్య పించ‌న్లు, ఉద్యోగుల‌కు 47ప‌ర్సెంట్ ఫిట్మెంట్, నిరుద్యోగుల‌కు ఉద్యోగ క‌ల్ప‌న, మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ‌.. ఇంత‌టి గొప్ప ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకెళ్తున్న కేసీఆర్ ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఢోకా ఉండ‌దని, అస‌లు గులాబీ పార్టీకి పోటీ ఇచ్చే ఇత‌ర పార్టీ తెలంగాణలో లేద‌ని హ్యాపీగా ఉండాల్సిన టీఆర్ఎస్ శ్రేణులు ఎందుకో క‌ల‌వ‌ర ప‌డుతున్నాయి.

ముఖ్య‌మంత్రే కాదు.. నాయ‌కులు కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయాలి..

ముఖ్య‌మంత్రే కాదు.. నాయ‌కులు కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేయాలి..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా 39మంది ప్ర‌జాప్ర‌తినిదుల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని చెప్ప‌డంతో ఆ పార్టీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. ఓ ప‌క్క సంక్ష‌మ ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌లోనే కాకుండా వాటిని అమ‌లు చేయ‌డంలో దేశంలోనే ప్ర‌థ‌మ‌స్థానంలో ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వ‌స్తే.. మ‌రో ప‌క్క అదికార పార్టీ నాయ‌కుల పైన ప్ర‌జ‌ల ఆగ్ర‌హం ఎందుకు..? ఎక్క‌డో తేడా కొడుతోంది.. అదేంటో తెలుసుకుందాం..
మాట్లాడితే వంద సీట్లు. కొన్ని సర్వేల్లో అయితే 103 దాకా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ. ఇదీ ముఖ్యమంత్రి కెసీఆర్ నుంచి మంత్రి కెటీఆర్ వరకూ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాటలు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. అది కూడా సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ నుంచే కావటంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తప్పదా అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఇంత చేస్తున్నా ప్ర‌తికూల ఫ‌లితాలొస్తున్నాయంటే లోపం ఎవ‌రిది..

ఇంత చేస్తున్నా ప్ర‌తికూల ఫ‌లితాలొస్తున్నాయంటే లోపం ఎవ‌రిది..

సాక్ష్యాత్తూ సీఎం కెసీఆరే అధికార పార్టీకి చెందిన 39 మంది నియోజకవర్గాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని..దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అంతే సంగతులు అని హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన జోష్ లో...ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ గత ఎన్నికల సమయంలో కేవలం 63 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించి ఆ సంఖ్యను 90కు చేర్చుకున్నారు. టీఆర్ఎస్ సొంత బలం 63 ప్రకారం 39 మందికి గెలుపు ఛాన్స్ తక్కువ ఉండే టీఆర్ఎస్ ఫిగర్ 24కు పడిపోతుంది. పోనీ 90 మందితో లెక్కిస్తే 51కి పడిపోతుంది. ఏ లెక్కన చూసుకున్నా వచ్చే ఎన్నికలు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయనే విషయాన్ని తాజా సర్వేలు తేల్చిచెప్పినట్లు వెల్లడవుతోంది.

ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌నిచేయ‌క‌పోతే వేటు త‌ప్ప‌దు...

ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌నిచేయ‌క‌పోతే వేటు త‌ప్ప‌దు...

రైతు బంధు పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద రైతుల కంటే సంపన్న రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరటం..అసలైన వ్యవసాయదారులుగా ఉన్న కౌలు రైతులను ఏ మాత్రం పట్టించుకోకపోవటం సర్కారుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత కాలం వంద సీట్లకు పైగా సాధిస్తామని చెబుతున్న కెసీఆర్ కు తాజా పరిణామం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్న 39 మంది ఎమ్మెల్యేలు ఈ నాలుగేళ్లలో కూడగట్టుకున్నవ్యతిరేకతను..ఏడాది లోపు పొగొట్టుకుని ట్రాక్ లోకి రాగలరా?. ఆయా స్థానాల్లో అభ్యర్థులను మార్చితే సిట్టింగ్ లు చూస్తూ ఊరుకుంటారా?. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా నిలవటం ఖాయంగా కన్పిస్తోంది.

English summary
telangana cm kcr expressed dissatisfaction about his mla's. kcr said near about 39 leaders of his party have to improve the public service skills. otherwise party will take harsh decision on that leaders he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X