హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'హార్వర్డ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ (హెచ్‌మన్) ఇండియా 2015' సదస్సు గురువారం నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 14 దేశాలకు చెందిన 1400 మంది విద్యార్ధులు పాల్గొంటున్నారు.

ఈ సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో చర్చిస్తారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజిక వేత్త, నటి నందితా దాస్‌తో పాటు ప్లేమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ ఈ సదస్సుని ప్రారంభించారు.

ఈ సదస్సులో నిష్ణాతుల చేత ఆయా అంశాలపై కీలకోపన్యాసాలు ఉండటంతో పాటు నిర్మాణాత్మకంగా ఆయా అంశాలపై సూచనలు కూడా విద్యార్ధులు చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు. నటి నందితా దాస్ మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో అసమానతలకి తమదైన పరిష్కారాలని వీరు చూపగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఓ సినిమా స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నానంటూ హైదరాబాద్ పట్ల తన మదిలో ప్రత్యేక స్ధానం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీథోవెన్ మ్యూజిక్‌కి భరతనాట్యం చేసి కిరణ్మయి ప్రేక్షకులను అలరించింది.

నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

'హార్వర్డ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ (హెచ్‌మన్) ఇండియా 2015' సదస్సు గురువారం నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 14 దేశాలకు చెందిన 1400 మంది విద్యార్ధులు పాల్గొంటున్నారు.

 నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

ఈ సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో చర్చిస్తారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజిక వేత్త, నటి నందితా దాస్ పాల్గొన్నారు.

 నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగలికే శక్తి యువతకు ఉందని అన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతి విద్యార్ధికి ఒక్కో ఆలోచన ఉంటుందని, వారి మేథస్సుకు అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలు సైతం వస్తాయని అన్నారు.

 నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

నోవాటెల్‌లో నటి నందితా దాస్: ఆ శక్తి యువతకే ఉంది

వారి ఆలోచనలను ఆచరణలో పెడితే ప్రచంచ దేశాల స్ధితి గతులను మార్చవచ్చని అన్నారు. ప్రస్తుతం భారత్ అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోందని త్వరలోనే అభివృద్ధి చెంది దేశాల సరసన నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్ధులను రేపటితరం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

English summary
“It is not just conviction but courage that makes one stand out. One generation that thinks out of the box would make a huge change. Think differently rather than falling back on conventional ways” said actress and social activist Nandita Das after inaugurating the fifth edition of Harvard Model United Nations India (HMUN) 2015 at HICC- Novotel in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X