వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణను పీడిస్తున్న లంచం..! ఆటపాట తోనే తరిమికొట్టాలన్న గోరేటి వెంకన్న..!!

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌/హైదరాబాద్: తెలంగాణలో అవినీతి, లంచగొండి తనం పేట్రేగిపోతోంది. లంచం అడిగితే చెప్పుతో కొట్టాలన్న సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశించినప్పటికి కొంత మంది ప్రభుత్వ అదికారులు తీరు మార్చుకోవడం లేదనే అపవాదు ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికి అదికారులు ఏ చిన్న పని చేసి పెట్టాలన్నా చేతులు చాస్తుండడంతో సామాన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లి పోతున్నారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న అవినీతి రక్కసిని అంతం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని తెలంగాణ వాదులు భావిస్తున్నారు.

<strong>ఇక ఇంటికే రేషన్ సరుకులు..! వినూత్న అడుగులు వేయనున్న జగన్ సర్కార్..!! </strong>ఇక ఇంటికే రేషన్ సరుకులు..! వినూత్న అడుగులు వేయనున్న జగన్ సర్కార్..!!

అందులో బాగంగా తెలంగాణ కళాకురులు, ప్రజా గాయకులు, సాహితీ వేత్తలు నడుం బిగిస్తుున్నారు. ముఖ్యంగా తెలంగాణను పట్టి పీడిస్తున్న లంచంపై ధూంధాం కళాకారులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజా గాయకుడు గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. లంచం మహమ్మారిని అంతమొందించాలన్నారు.

Have to iradicate bribes in Telangana by cultural activities only..says goreti Venkanna..!

తెలంగాణలో అవినీతిని అంతమొందించడానికి కళాకారులు కాలుకు గజ్జె కట్టాల్సిన సమయం ఆసన్నమైందని గోరేటి వెంకన్న అభిప్రాయ పడ్డారు. తెలంగాణ సాధనలో ఆటాపాటలతో ముఖ్య భూమిక పోషించిన కళాకారులు, ఇప్పుడు కూడా కాలికి గజ్జె కట్టి లంచాన్ని రూపుమాపడానికి నడుం కట్టాలన్నారు. ఎన్నో ఉద్యమాలతో, అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో లంచం మహమ్మారి తిష్ఠ వేసిందన్నారు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన సంగీత్‌ కల్చరల్‌ అకాడమీ 15వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, కళాకారులకు, వృద్ధులకు, కులవృత్తుల వారికి అండగా నిలబడి సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ఆటాపాటలతో ఉద్యమంలో ఒక్కటైన కళాకారులు అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడాలని సూచించారు.

English summary
The Telangana Conservatives believe that it is time to end the widespread corruption that is stretched. Telangana artists, public singers and literary scholars are in the running. Public singer Gorati Venkanna called for another movement of the dhum dham artists on the bribe that is particularly plaguing Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X