• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మొదటి ప్రియుడు అత్యాచారం.. రెండో ప్రియుడు అబార్షన్.. తల్లిని చంపిన కేసులో కొత్త కోణం..!

|

హైదరాబాద్ : హయత్‌నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో రోజుకో నిజం వెలుగు చూస్తోంది. పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారిస్తున్న క్రమంలో పూటకో ట్విస్ట్ బయట పడుతోంది. మొదటి ప్రియుడు అత్యాచారం చేస్తే.. రెండో ప్రియుడు అబార్షన్ చేయించాడనే కొత్త కోణం విస్మయానికి గురి చేస్తోంది. 19 ఏళ్ల వయసులో కూతురు తెలిసి తెలియక చేసిన చిన్న తప్పు ఆ కుటుంబాన్ని అగాధంలోకి నెట్టేసింది. కన్నకూతురి చేతిలో ఓ తల్లి అర్ధాంతరంగా తనువు చాలించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పుదారిలో వెళుతున్నావమ్మా అని వద్దని వారిస్తే ఏకంగా అమ్మను కానరాని లోకాలకు పంపిన కూతురు ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

కన్నతల్లి హత్య కేసులో రోజుకో ట్విస్ట్

కన్నతల్లి హత్య కేసులో రోజుకో ట్విస్ట్

హయత్‌నగర్‌లో కన్నతల్లిని కూతురు హత్య చేసిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 19 ఏళ్ల వయసులో ప్రేమ దోమ అంటూ ఆకర్షణకు లోనైన కీర్తి తప్పుదారిలో పయనించి చివరకు కుటుంబాన్ని అగాధంలోకి నెట్టేసింది. ఏది మంచో, చెడో తెలుసుకోని టీనేజీ వయసులో ఒకడికి దగ్గరై.. అంతలోనే మరొకడికి చేరువై చివరకు కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. కన్నతల్లినే కర్కశంగా హతమార్చి సమాజం దృష్టిలో చెడ్డపేరు తెచ్చుకుంది.

పక్కింటి కుర్రాడితో అలా.. మద్యం తాగి.. కన్నతల్లి హత్య కేసులో మరెన్నో ట్విస్టులు..!

ఒక్క కూతురని గారాబంగా పెంచితే..!

ఒక్క కూతురని గారాబంగా పెంచితే..!

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో పదేళ్ల కిందట భార్య రజిత, కూతురు కీర్తితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నాడు. హయత్‌నగర్ పరిధిలోని ద్వారకా సాయి నగర్ కాలనీలో సొంతిల్లు కట్టుకున్నాడు. ఒకే ఒక్క కూతురు కావడంతో కీర్తిని కాస్తా గారాబంగా పెంచారు. ప్రస్తుతం ఆమె దిల్‌సుఖ్ నగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కీర్తి వేసిన తప్పటడుగు ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. భార్య చనిపోయి, కూతురు జైలు పాలై చివరకు శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నంతలో కూతురును బాగా చూసుకున్న ఆ తండ్రికి ఇప్పుడు ఎవరూ దిక్కులేకుండా పోయినట్లైంది.

ఇద్దరితో ప్రేమాయణమా.. అసలేం జరిగింది..!

ఇద్దరితో ప్రేమాయణమా.. అసలేం జరిగింది..!

బాల్‌రెడ్డి అనే వ్యక్తితో కీర్తి ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఒకసారి తనపై అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. అయితే అబార్షన్ చేయించాలని కీర్తి వత్తిడి చేసినా బాల్‌రెడ్డి పట్టించుకోనట్లు సమాచారం. దాంతో పొరుగున ఉండే శశి కుమార్ కీర్తికి దగ్గరయ్యాడు. అబార్షన్ తాను చేయిస్తానంటూ మాటిచ్చి.. చెప్పిన ప్రకారం గర్భం తీయించాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య చనువు పెరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీన్ని ఆసరాగా చేసుకున్న శశి కుమార్ వీలు చిక్కినప్పుడల్లా కీర్తిని శారీరకంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వారిద్దరు సన్నిహితంగా మెలిగిన సమయంలో వీడియోలు కూడా తీశాడట.

ఇద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి..!

ఇద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి..!

అలా వీడియోలు తీసిన శశి కుమార్ వాటిని భద్రపరిచాడు. అయితే వీరిద్దరి వ్యవహారం తెలిసిన కీర్తి తల్లి రజిత ఆమెను మందలించడం మొదలెట్టింది. తప్పు చేస్తున్నావంటూ హెచ్చరించింది. అదే క్రమంలో ఈ నెల 19వ తేదీన కూరగాయల కోసం తల్లి బయటకు వెళ్లడంతో కీర్తి ఇంట్లో దూరాడు శశి కుమార్. ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగొచ్చిన రజిత.. వారిద్దరినీ చూసి చెడామడా తిట్టిందట. దాంతో కోపం పెంచుకున్న శశి కుమార్ ఆమెను చంపేయాలని స్కెచ్ వేశాడు. అందుకోసం కీర్తినే పావుగా వాడుకోవాలని డిసైడయ్యాడు.

శివసేనతోనే ప్రభుత్వ ఏర్పాటు.. విభేదాలు లేవు.. అభిప్రాయ భేదాలే : ఫడ్నవీస్

తల్లిని చంపకుంటే వీడియోలు బయటపెడతానంటూ..!

తల్లిని చంపకుంటే వీడియోలు బయటపెడతానంటూ..!

అదే విషయం కీర్తితో చెబితే కన్నతల్లిని చంపడానికి ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది. దాంతో బ్లాక్‌మెయిల్ అస్త్రం తెరమీదకు తెచ్చాడు శశి కుమార్. చెప్పిన మాట వినకుంటే తామిద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించాడట. ఆ క్రమంలో శశి కుమార్ బెదిరింపులకు భయపడి, వేరే గత్యంతరం లేక అతడు చెప్పినదానికి ఓకే చెప్పింది. అలా ఇద్దరూ కలిసి మద్యం సేవించి రజితను హత్య చేశారు. తల్లిని చంపాలంటే ధైర్యం సరిపోవడం లేదని కీర్తి చెప్పడంతోనే తాను వెళ్లి బీర్లు తీసుకొచ్చాడని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శశి, బాల్‌రెడ్డి, కీర్తిని వేర్వేరుగా విచారిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే రోజుకో నిజం వెలుగు చూస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేసు దర్యాప్తు ముమ్మరం కావడంతో.. బాల్‌రెడ్డి, శశి కుమార్ కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు.

English summary
Mother murder case in Hayatnagar area is getting new twists every day. The police are investigating the accused differently. If the first boyfriend is raped .. The new perspective that the second boyfriend is abortion is astonishing. A 19-year-old daughter's unintentional mistake made the family abyss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X