వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల తొలగింపుపై టెక్ మహీంద్రాకు హైకోర్టు నోటీసులు

ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టెక్‌ మహీంద్రాకు ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టెక్‌ మహీంద్రాకు ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌కు నోటీసులిచ్చింది.

అనంత్ నాగ్ లో విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు మృతిఅనంత్ నాగ్ లో విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఏడుగురు అమర్ నాథ్ యాత్రికులు మృతి

ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

tech-mahindra

టెక్‌ మహీంద్రాలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్‌ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రామచంద్రరావు ఇవాళ విచారణ జరిపారు.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. టెక్‌ మహీంద్రా కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవుపై వెళ్లాలని కూడా వేధిస్తోందని తెలిపారు.

దీనిపై రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందని వివరించారు. కార్మిక శాఖ జాయింట్‌ కమిషన ర్‌ చర్యలు తీసుకునేలోపే ఆ కంపెనీ ఉద్యోగుల్ని తొలగించడం అన్యాయమని, ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగా తొలగించరాదని షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 47(2) స్పష్టం చేస్తోందన్నారు.

ఈ సెక్షన్‌ నుంచి ఐటీ కంపెనీలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22 అమలు కాకుండా హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిందని, కాబట్టి ఈ నిబంధన ఐటీ కంపెనీలకు వర్తిస్తుందని ఆయన వివరించారు.

ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమిషనర్‌ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్యప్రసాద్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న టెక్‌ మహీంద్రా కంపెనీతోపాటు తెలంగాణ కార్మిక శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. టెక్‌ మహీంద్రాకు వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్‌కు అనుమతినిస్తూ విచారణను వాయిదా వేశారు.

English summary
The High Court of Telangana and Andhra Pradesh on Monday admitted a writ petition from sacked employees of Tech Mahindra, who took the company and the Telangana government to court for asking them to quit unceremoniously. The writ petition came after four retrenched employees claimed they were terminated unlawfully as they were in mediation with the company and labour commissioner over the manner of retrenchment. According to the Forum of IT Professionals (ForIT), an organisation working for the welfare of IT professional since 2007 in Andhra Pradesh and Telangana, Justice MS Ramachandra Rao admitted the writ petition filed by four retrenched employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X