వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్ కొనసాగింపు: మావోల మృతదేహాలపై హైకోర్టు ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను తరలించడంలో జాప్యం జరుగుతోంది. శనివారంనాడు మృతదేహాలను తరలిస్తారని అంటున్నారు.

తెలంగాణలోని భద్రాద్రి జిల్లా చర్ల మండలం తొండపాల్ వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మవోయిస్టులు మరణంచిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పౌర హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. మావోయిస్టుల మృతదేహాలకు వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రిలో పోస్టు నిర్వహించాలని పౌర హక్కుల సంఘం కోరింది.

HC orders to conduct postmartum to the dead naxalits in the presence of experts

అయితే, భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీయాలని, ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించాలని,, బంధువులకు అప్పగించే వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలిచ్చిది. ఈ కేసుపై తదుపరి విచారణను రెండడు వారాలకు వాయిదా వేసింది.

మరణించిన 10 మంది మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఎదురు కాల్పుల్లో సుశీల్ అనే పోలీసు కమండో మరణించాడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ గాయపడినట్లు తెలుస్తోంది.

మృతుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ జగన్ ఉన్నాడు అతనిపై 30 లక్షల రూపాయల నగదు బహుమతి ఉంది. అతనిపై 50 కేసులు ఉన్నట్లు సమాచారం. హరిభూషణ్ సహచరి సమ్మక్క కూడా మృతుల్లో ఉంది.

English summary
High Court ordered to conduct postmartum to the dead Maoists in the presence of experts at Bhadrachalam hospital of Telagana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X