• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆయన భవనాలు కూల్చేయాల్సిందే: వివేకానందకు మళ్లీ కోర్టులో చుక్కెదురు

|

హైదరాబాద్‌: ఇటీవలే టిఆర్ఎస్ పార్టీలో చేరిన కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కెపి వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అక్రమంగా నిర్మించిన భవన సముదాయాలను కూల్చేయాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమంటూ తదుపరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ పివి సంజయ్‌ కుమార్, జస్టిస్‌ ఎస్‌వి భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్‌ఎంసీ అనుమతుల్లేకుండా భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారంటూ వివేక్‌ సమీప బంధువు కెఎం ప్రతాప్‌ హైకోర్టులో గత సంవత్సరం ఏప్రిల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేగాక, కార్పోరేషన్‌కు రూ.60 లక్షల రుసుము ఎగవేశారని పేర్కొన్నారు.

HC refuses to entertain MLA's plea

దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సివి నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. భవన సముదాయంలోని కాలేజీని జూన్‌ 1కల్లా ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆదేశించారు.

ఈ తీర్పును సవాల్‌చేస్తూ వివేక్, ఆయన కుటుంబ సభ్యులతోపాటు నారాయణ కాలేజీ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా జస్టిస్‌ పివి సంజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని గురువారం విచారించింది.

ఎమ్మెల్యే వివేక్‌ తరఫు న్యాయవాది మనోహర్‌రెడ్డి, నారాయణ కాలేజీ తరఫున బి నళిన్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌) కింద పిటిషనర్లు దరఖాస్తు చేసుకున్నారని.. బీపీఎస్‌పై హైకోర్టులో విచారణ సాగుతోందన్నారు.

పిటిషనర్లు భవన నిర్మాణాలు చేపట్టే నాటికి బీపీఎస్‌ పథకం అమల్లో లేదు కదా అని ధర్మాసనం పేర్కొంది. ఈ పథకంపై పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల్లో అక్రమ కట్టడాలను కూల్చొద్దని సంబంధిత ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు కదా అని స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి తీర్పు సమగ్రంగా ఉందని, దీని అమలును నిలి పేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A vacation bench of the Hyderabad High Court on Thursday refused to entertain an appeal filed by Qutbullapur MLA Vivekananda against an order of a single judge who directed authorities to demolish the house of his kin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more