హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెచ్‌సియు ప్రొఫెసర్‌పై బూతుపురాణం: సూరేపల్లి సుజాత తర్వాత...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాతవాహన విశ్వవిద్యాలయయంలో ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత మీద జరిగిన దాడి ఘటన మరిచిపోక ముందే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో మరో సంఘటన వెలుగు చూసింది.

సూరేపల్లి సుజాత టార్గెట్: వివాదం, ఆసలేం జరిగింది? సూరేపల్లి సుజాత టార్గెట్: వివాదం, ఆసలేం జరిగింది?

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ లక్ష్మినారాయణపై బూతుపురాణాన్ని విప్పారు. వామపక్ష, దళిత బహుజన దృక్పథం గల ఆచార్యులను, అధ్యాపకులను లక్ష్యం చేసుకుని ఈ దాడి జరుగుతున్న సూచలను కనిపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆయన దళిత ప్రొఫెసర్

ఆయన దళిత ప్రొఫెసర్

దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్‌గా లక్ష్మినారాయణ హెచ్‌సియు అర్థశాస్త్రం విభాగంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. నిరుడు నవంబర్‌ 25న అర్థశాస్త్రంలో విద్యార్థులకు ఓ పరీక్ష నిర్వహించారు. దీనిలో విద్య వ్యాపారీకరణ, కాషాయీకరణతో వస్తున్న మార్పు లకు సంబంధించిన ఒక ప్రశ్న ఉంది.

దాన్ని సహించలేకనే టార్గెట్..

దాన్ని సహించలేకనే టార్గెట్..

ఈ పరీక్షాపత్రంలో 'కాషాయీకరణ' అనే పదాన్ని వాడడాన్ని సహించలేని ఓ విద్యార్థి సంఘానికి చెందినవాళ్లు సోషల్‌ మీడియాలో లక్ష్మనారాయణను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ పోస్టు చేశారు. ఏబీవీపీ సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ జాతీయ కోఆర్డినేటర్‌గా ఉన్న కరన్‌ పల్స్‌నియా అనే హెచ్‌సీయూ విద్యార్థి ఫెస్‌బుక్‌లో ఓ పోస్టు చేశాడు.

ఆ పోస్టు ఇదీ.. తర్వాత తొలగించారు..

ఆ పోస్టు ఇదీ.. తర్వాత తొలగించారు..


ప్రొఫెసర్ లక్ష్మినారాయణపై అసభ్య పదజాలం వాడుతూ, కాషాయీకరణ అంటే ఏంటో ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు..అతనికి ఎకనామిక్స్‌లో ప్రాథమిక అవగాహన కూడా లేదు..అయినా కాషాయీకరణపై ప్రచారం చేస్తున్నాడు. బెదిరించడం ద్వారానే ప్రొఫెసర్‌గా మారాడు...ఆయన గురించి విద్యార్థులు ఎప్పుడు చెబుతారు..'' అంటూ అతను పోస్టు చేశాడు.

పోస్టుపై వీసీకి ఫిర్యాదు..

పోస్టుపై వీసీకి ఫిర్యాదు..

నవంబర్‌ 30న వర్సిటీ వీసీ అప్పారావుతో పాటు ప్రోక్టోరల్‌ బోర్డుకూ ఏబీవీపీ నేత చేసిన ఫేస్‌బుక్‌ పోస్టుపై ఆధారాలతో లక్ష్మినారాయణ ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన ఆ ఏబీవీపీ నేత ప్రొఫెసర్‌పై చేసిన పోస్టులను ఫెస్‌బుక్‌ నుంచి తొలగించారు. హెచ్‌సీయూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారం తర్వాత మరోసారి వీసీ కార్యాలయానికి ఆయన లేఖరాశారు. డీన్‌ అభిప్రాయం కోసం లేఖ రాశామని వారు ప్రొఫెసర్‌కు తిరిగి సమాధానం ఇచ్చారు.

English summary
It is alleged that Dalit proffessor of Hyderabad Central University (HCU) has been made target by right wing studnets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X