హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారులోనే కేక్ కట్ చేసి, అంతలోనే: సీటు బెల్ట్ ధరించని అనన్య, ప్రమాదానికి కారణాలివే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad Outer Ring Road Road Mishap : అనన్య ప్రమాదానికి కారణాలివే !

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూపీకి చెందిన హెచ్‌సీయు విద్యార్థి అనన్య మృతి చెందిన విషయం తెలిసిందే. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా అనన్య, ఆమె స్నేహితులు జతిన్, నిఖితలు అర్దరాత్రి వరకు రోడ్డుపై కారులో తిరిగారు. ఆ తర్వాత మంగళవారం వేకువజామున భోజనానికి వెళ్లే క్రమంలో అతివేగంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు.

చదవండి: ఔటర్‌లో ఘోర ప్రమాదం, అనన్య మృతి: ఎగిరిపడ్డ కారు, దొరికిన మద్యం బాటిల్

శంషాబాద్‌ పోలీసులు చెప్పిన ప్రకారం యూపీకి చెందిన, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న అనన్య (21), నేపాల్‌కు చెందిన నిఖిత స్నేహితులు. నిఖిత స్నేహితుడు, గచ్చిబౌలిలో ఉంటూ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న జోద్‌పూర్‌కు చెందిన జతిన్‌ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి ఇద్దరూ గచ్చిబౌలి వెళ్లారు.

కారులోనే కేక్ కట్ చేసి, సంతోషంగా

కారులోనే కేక్ కట్ చేసి, సంతోషంగా

కారులోనే కేక్ కట్ చేశారు. పార్టీ చేసుకున్నారు. చాలాసేపు కారులో నగరంలో తిరిగారు. ఆ తర్వాత భోజనం చేయడానికి మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న డాబా వద్దకు వెళ్లాలనుకున్నారు.

అక్కకు ద్రోహం, బావతో సంబంధం: భర్తను చంపిన శ్రీవిద్య నవ్వుతూ, షాకింగ్ విషయాలుఅక్కకు ద్రోహం, బావతో సంబంధం: భర్తను చంపిన శ్రీవిద్య నవ్వుతూ, షాకింగ్ విషయాలు

చీకట్లో అయోమయానికి గురై

చీకట్లో అయోమయానికి గురై

దీంతో నగరం నుంచి అటు వైపు కారును తిప్పారు. ఔటర్‌ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్‌ దిశగా వెళ్లారు. చీకట్లో అయోమయానికి గురై పెద్ద గోల్కొండ జంక్షన్‌ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిందకు దిగారు. తర్వాత పీ1 రహదారిపై వస్తుండగా 3.20 గంటల ప్రాంతంలో బూర్జుగడ్డ తండా మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు తిరగబడింది.

జూబ్లీహిల్స్ ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ మృతి: మరో కారు మధ్యలో, అమ్మాయిలు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు?జూబ్లీహిల్స్ ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ మృతి: మరో కారు మధ్యలో, అమ్మాయిలు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు?

సీటు బెల్టు ధరించని అనన్య

సీటు బెల్టు ధరించని అనన్య

అనన్య సీటు బెల్టు ధరించలేదు. ఆమెతో పాటు ముగ్గురూ గాయపడ్డారు. వేకువజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో బాధితులను ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అనన్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన గంట వరకు అనన్య రక్తపు మడుగులోనే కొట్టుమిట్టాడిందని, సకాలంలో చికిత్స అంది ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని స్థానికులు చెబుతున్నారు.

కారు వేగం, మత్తు

కారు వేగం, మత్తు

ప్రమాదం సమయంలో కారు వేగం దాదాపు 120 కిలో మీటర్లకు పైగా ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కారులో పగిలిన మద్యం సీసాలు ఉన్నాయి. దీంతో జతిన్ మద్యం తాగి కారు నడిపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అతని రక్తనమూనాలను సేకరించారు. మద్యం మత్తు, అతివేగం కారణంగా క్రాస్‌ను గుర్తించకపోవడం వల్ల ప్రమాదానికి గురైనట్లుగా భావిస్తున్నారు.

English summary
Drunk driving appears to have claimed another life in the city during wee hours of Tuesday. A 21 year old University of Hyderabad student Ananaya Goel was killed when the car she was travelling turned turtle after the vehicle’s driver lost control on hitting a median.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X