హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి.. సూసైడ్ నోట్‌లో హైదరాబాద్ బ్యాంకు ఉద్యోగి..

|
Google Oneindia TeluguNews

అతనో బ్యాంకు ఉద్యోగి. ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు యత్నించాడు. బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఊహించని రీతిలో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఏ కారణంతో అతను ఆత్మహత్యకు యత్నించి ఉంటాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు కారణాలు చెప్పనప్పటికీ.. అతను రాసిన సూసైడ్ నోట్‌లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఎవరతను..

ఎవరతను..

ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తలూరి శ్రవణ్(20) జూబ్లీహిల్స్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహ అనంతరం జూబ్లీహిల్స్‌ రోడ్ నం.10లోని గాయత్రిహిల్స్‌లో భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు.

 ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

ఇంట్లో ఎవరూ లేని సమయంలో..

ఇటీవల సంక్రాంతి పండగ నేపథ్యంలో శ్రవణ్ భార్య పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ తర్వాత కడుపులో నొప్పి కారణంగా గట్టిగా కేకలు పెట్టాడు. అరుపులు,కేకలకు భయపడ్డ చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్ఐ శేఖర్‌తో పాటు కానిస్టేబుల్స్ అక్కడికి చేరుకున్నారు.

 కోమాలో శ్రవణ్..

కోమాలో శ్రవణ్..

అనంతరం శ్రవణ్‌ను మాదాపూర్‌లోని మాక్స్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సమయంలో పురుగుల మందు బాటిల్‌ను ఎస్ఐ వాసన చూడటంతో ఆయనపై కూడా కొద్దిగా ప్రభావం చూపించినట్టు సమాచారం. ప్రస్తుతం శ్రవణ్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కోమాలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

భార్యకు మళ్లీ పెళ్లి చేయాలని..

భార్యకు మళ్లీ పెళ్లి చేయాలని..


ఆత్మహత్యకు యత్నించడానికి ముందు శ్రవణ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నాడు. తన తండ్రికి కొంత డబ్బు ఇవ్వాల్సి ఉందని.. వాటిని తిరిగి ఇచ్చేయాలని పేర్కొన్నాడు. అలాగే మరొకరి నుంచి తనకు రావాల్సిన డబ్బులతో కర్మకాండలు జరిపించాలన్నాడు. ఇక తన భార్య హరిత చాలా మంచిదని, ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని కోరాడు. ఆత్మహత్యకు పాల్పడుతున్నందుకు తనను క్షమించాలని ఆమెను కోరాడు. తన తండ్రే తనకు హీరో అని, అమ్మా నిన్ను వదిలి వెళ్లిపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఆత్మహత్యకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Jubilihills HDFC bank Deputy Manager Chittaluri Shravan attempted suicide on friday night at his home in Gayatrihills. Police rushed immediately to the spot and took him to a private hospital in Madapur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X