హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెగ్గు పడితే పోలీసైపోతాడు.. అందిన కాడికి దోచేస్తాడు..! దొంగ వెధవ..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కడుపుకు అన్నం తినే మనిషికి 64 కళల్లో ఏదో ఒక కళలో ప్రవేశం ఉంటుంది అంటారు. మానవాతీతుడు, అవలక్షణాలు ఉన్న వాడికే 64కళల్లో ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది అంటారు. హైదరాబాద్ నగరం నాగోలులో ఇలాంటి సకలకళా వల్లభుడి లీలలు వెసుగులోకి వచ్చాయి. అతగాడు గతంలో ఆటోడ్రైవర్‌... కానీ.. తాగితే పోలీసవుతాడు. వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగి దోచుకుంటాడు. ఈ నకిలీ పోలీసు బారినపడి ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చాలామంది తమ నగలు, నగదు సమర్పించుకున్నారు.

Recommended Video

టీజర్ చూపించే వరకు ఆగలేకపోతున్నాడట

ఎట్టకేలకు నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ నిందితుడికి సంబందించిన ఆశ్చర్యకర వివరాలను విలేకరులకు వెల్లడించారు.
నల్గొండ జిల్లా డిండి మండలం దేవత్‌పల్లి తండాకు చెందిన ఇరవై ఏడు సంవత్సరాల రమావత్‌ నరేష్‌ గతంలో ఎల్బీనగర్‌ కేంద్రంగా ఆటో నడిపేవాడు. బెదిరించి నగలు దోచుకున్న ఘటనల్లో జైలుకు వెళ్లొచ్చాడు. తాజాగా మళ్లీ దోపిడీలకు తెరలేపాడు. ద్విచక్రవాహనంపై బస్టాపు వద్దకు వచ్చి వృద్ధులను లక్ష్యంగా చేసుకొని, దుర్భాషలతో భయభ్రాంతులకు గురిచేసి స్టేషనుకు పదమంటూ ఆటో ఎక్కిస్తాడు. ఒంటిపై నగలు ఎందుకంటూ లాక్కుంటాడు.

 He become police when he drunk..!!

ఆ తర్వాత ఠాణాకు అవసరంలేదంటూ నగలు వారికే ఇచ్చి వెళ్లిపోతాడు. తీరా చూసుకుంటే దోచిన సొత్తులో కొంతమాత్రమే ఉండటం చూసి బాధితులు బావురుమంటారు. ఇతని బారినపడినవారిలో పలువురు విశ్రాంత ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. ఎట్టకేలకు సీసీ టీవీ ఫుటేజీల్లో నిందితుడిని గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టుచేసి జైలుకు తరలించారు. అతని వద్ద 10తులాల బంగారం, ఓ బైకు స్వాధీనం చేసుకున్నారు.

English summary
He was formerly an autodriver ... but .. If he drinks, he becomes a policeman. He aims at the elderly and plunges into threats. The counterfeit police have been infected and many have lodged their jewelery and cash in the area of ​​LB nagar. Eventually the accused was arrested by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X