• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏకంగా సీఎంఓనే వాడేశాడు .. అద్దె కార్లంటూ నిలువునా ముంచాడు

|

హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా సీఎంఓలో కార్లు అద్దెకు పెడతామంటూ అద్దె పేరుతో కార్లు తీసుకుని వాటిని తనఖా పెట్టి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్ళ గుట్టు రట్టయింది . సీఎంఓ పేరును వాడేసి ఇష్టారాజ్యంగా మోసాలు చేసిన ఇద్దరిని ఎల్బీ నగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2 కోట్ల 45లక్షల 70వేల విలువైన 23 కార్లు, 4 సెల్‌ ఫోన్లు, రూ. 4.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అరెస్ట్ తప్పదా ? ముందస్తు బెయిల్ నిరాకరణ.. అజ్ఞాతంలో కొండా

సీఎంఓలో కార్లు అద్దెకు పెట్టిస్తానని మోసం చేసిన కేటుగాడు

సీఎంఓలో కార్లు అద్దెకు పెట్టిస్తానని మోసం చేసిన కేటుగాడు

ప్రధాన నిందితుడు అయిన కందుల శ్రీకాంత్‌చారి అలియాస్‌ అమ్ముల శ్రీకాంత్‌ చేసిన మోసం వింటే షాక్ తింటారు . 7వ తరగతి వరకు చదువుకున్న ఈ కేటుగాడు 2017లో 10 నెలల పాటు సీఎం కార్యాలయంలో తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేశాడు. డ్యూటీకి సరిగా రాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తరువాత సీఎంఓ ఆఫీస్ పేరునే వాడేసిన ఈ కేటుగాడు విలాసాలకు ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్నట్లు అమాయకులను నమ్మింఛి మోసం చెయ్యటం ప్రారంభించాడు . తనకు తెలిసిన అధికారుల దగ్గర కార్లను అద్దెకు పెట్టిస్తానని జనాలను నమ్మించి ఆ తర్వాత వాటిని అమీర్‌పేట్ కు చెందిన సర్దార్‌ మహేందర్‌సింగ్‌ అలియాస్‌ బంటు అనే ఫైనాన్షియర్‌ దగ్గర తనఖా పెట్టేవాడు.

కార్లను తనఖా పట్టి జల్సాలు చేసిన మోసగాడు

కార్లను తనఖా పట్టి జల్సాలు చేసిన మోసగాడు

శ్రీకాంత్ కార్లను అప్పగించినందుకు ఫైనాన్షియర్‌ బంటు శ్రీకాంత్ కి రూ. 4 లక్షలు ఇచ్చేవాడు. అలా వచ్చే డబ్బును కార్ల ఓనర్లకు నెలకు రూ.30 వేల చొప్పున వారికి అనుమానం రాకుండా చెల్లించేవాడు . అలా అతడి మాయమాటల నమ్మిన కొంతమంది తమ కార్లను ఇచ్చేవారు. మొదటి నెల అద్దె డబ్బులు మాత్రమే ఓనర్లకు ఇచ్చేవాడు. తర్వాత నెల.. కార్ల ఓనర్లకు డబ్బులివ్వకుండా.. ఫోన్‌ చేస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరిగేవాడు. దీంతో అనుమానం వచ్చిన కార్ల ఓనర్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో తీగ లాగితే డొంక కదిలింది. శ్రీకాంత్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

సీఎంఓ పేరు చెప్పి టోకరా వేసిన కేటుగాళ్ళ అరెస్ట్

సీఎంఓ పేరు చెప్పి టోకరా వేసిన కేటుగాళ్ళ అరెస్ట్

సదరు కార్లలో ఏడింటిలో జీపీఎస్‌ ఉండడంతో యజమానులు వాటిని గుర్తించి వెనక్కి తీసుకెళ్లారు. అలా లేని వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. ఇంకా 23 కార్లు మహేందర్‌సింగ్‌ అధీనంలోనే ఉన్నాయి. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కార్లను స్వాధీనం చేసుకున్నారు.మొత్తానికి సీఎంఓ పేరు చెప్పి ఇంత మందికి టోకరా వేసిన మోసగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి వీరి ఆట కట్టించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The fraud came out of Hyderabad in the name of rental cars. in the name of rented cars in the CMO a man chaeted the car owners .A man named srikanth studied 7th class cheated the people with the name of CMO office officials very nearer to him. and he said that to tha car owners he will keep the cars rent in CMO office. and he mortgaged them . with the amount he is enjoying . By the complaint of the car owners Two of the accused have been arrested by the LB Nagar SOT police. Rs. 23 cars, 4 cell phones, Rs 2 crore 45 lakh 70 thousand 4.70 lakh cash was seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more