మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లితో అక్రమ సంబంధం: బిడ్డపై హెడ్ కానిస్టేబుల్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

మెదక్: మెదక్ జిల్లాలో శివంపేటలో దారుణం జరిగింది. రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థినిపై హెడ్ కానిస్టేబుల్ హరి అత్యాచారానికి పాల్పడ్డాడు. హరికి బాలిక తల్లితో అక్రమ సంబంధం ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆమె కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అందుకు బాలిక తల్లి కూడా హరికి సహకరించింది. పోలీసులు నిందితుడు హెడ్ కానిస్టేబుల్ హరితో పాటు బాలిక తల్లిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 Head constable rapes 15 year old girl

హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో హరి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లితో శారీరక సంబంధం పెట్టుకున్న హరి ఆమె కూతురుని చెరబట్టాడు. దీంతో బాధితురాలు చైల్డ్‌లైన్ సంస్థను ఆశ్రయించింది. చైల్డ్‌లైఫ్ సంస్థ సహాకారంతో శివంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

కీచక కానిస్టేబుల్ హరి, అతనికి సహకరించిన బాలిక తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ను కఠినంగా శిక్షించాలని మహిళాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Head constable Hari raped 15 year old girl at Shivampet in Medak district Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X