telangana election result 2018 telangana election results 2018 telangana assembly elections 2018 five state assembly elections 2018 clp leader congress bhatti vikramarka sridhar babu sabitha indrareddy uttamkumar reddy తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2018 తెలంగాణ కౌంటింగ్ కాంగ్రెస్ భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు సబితా ఇంద్రారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ కు మరో చిక్కు.. సీఎల్పీ లీడర్ ఎంపికపై మల్లగుల్లాలు.. అసంతృప్తుల బెడద తప్పదా?
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిండా మునిగి తేలిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కొత్త చిక్కొచ్చి పడింది. హేమాహేమీలంతా ఓటమిపాలు కావడంతో సీఎల్పీ నేత ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల దెబ్బతో సముద్రం లాంటి కాంగ్రెస్ లో సీనియర్లంతా ఇంటి బాట పట్టారు. దీంతో శాసనసభ పక్ష నేతగా ఎవరిని నియమించాలనే అంశం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
సామాజిక వర్గాలు, అభ్యర్థుల సత్తా ఇలాంటి ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సీఎల్పీ లీడర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

ఎవరికి దక్కేనో?
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా ఓడిపోవడంతో సీఎల్పీ లీడర్ ఎవరనేది ప్రాధాన్యత సంతరించుకుంది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క గెలుపొందారు. వీరితో పాటు శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, గండ్ర వెంకటరమణ రెడ్డి, సుధీర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు శాసనసభ్యులుగా గెలిచారు. వీరందరికీ చట్టసభలు కొత్తేమీ కాదు. ఇక మిగిలినవారంతా అసెంబ్లీకి కొత్తవారే. అయితే సీఎల్పీ రేసులో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

ఉత్తమ్ ఇటొస్తే.. భట్టి అటు
శాసనసభ వ్యవహారాల్లో అనుభవమున్నవారిని చూస్తే మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. భట్టికి డిప్యూటీ స్పీకర్ గా, శ్రీధర్ బాబుకు శాసనసభ వ్యవహారాల మంత్రిగా, సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రిగా పనిచేసిన అనుభవముంది. అందుకే ప్రధానంగా ఈ ముగ్గురే సీఎల్పీ లీడర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాజగోపాల్ రెడ్డి, సీతక్క పేర్లు కూడా వినిపిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి దళితుల కోటాతో పాటు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం.. సీఎల్పీ పదవి భట్టికి కలిసొస్తుందని అంటున్నారు కొందరు. అటు టీపీసీసీ ప్రెసిడెంట్ రేసులోనూ భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. అదలావుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎల్పీ లీడర్ గా చేసి.. టీపీసీసీ కి అధ్యక్షుడిగా భట్టి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎల్పీ ఎంపిక.. అసంతృప్తుల బెడద..!
సీఎల్పీ లీడర్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన తప్పదంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ మహిళా కోటాను పరిగణనలోకి తీసుకుంటే సబితా ఇంద్రారెడ్డి పేరు ఖరారయ్యే అవకాశముంది. సామాజిక వర్గం పరంగా చూస్తే బ్రాహ్మణ కులానికి చెందిన శ్రీధర్ బాబుకు ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. అయితే ఎవరిని ఎంపిక చేసినా కూడా ఇతరుల్లో అసంతృప్తి సెగ రేగుతుందనే టాక్ వినిపిస్తోంది.