హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తస్మాత్ జాగ్రత్త: హైదరాబాద్‌ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ...ఐదుగురు మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పటి వరకు తిరుపతి నగరాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి హైదరాబాద్‌కు పాకింది. గత రెండు వారాల్లోనే పలు స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఈ వ్యాధితో బాధపడుతూ ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయని తెలంగాణ వైద్యవృత్తి డైరెక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

"ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ వ్యాధితో ఐదు మంది చనిపోయారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న ఇద్దరు ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో చేర్చారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వైన్‌ ఫ్లూతో బాధపడుతున్న మరో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వారు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అలర్ట్ చేశాం. స్వైన్ ఫ్లూ కిట్లను పంపిణీ చేశాం" అని రమేష్ రెడ్డి తెలిపారు.

Health alert: Swine flu kills five people in Hyderabad

స్వైన్ ఫ్లూ అనేది హెచ్1 ఎన్ 1 వైరస్. ఇది భారత్‌లో చాలా చోట్ల ఉంది. ఒక వ్యక్తికి హెచ్1 ఎన్ 1 వైరస్ సోకితే.. ఆ వ్యక్తి తుమ్మినా, ఆ వ్యక్తి పీలుస్తున్న గాలిని పీల్చనా పక్కనే ఉన్న వ్యక్తికి వ్యాపిస్తుంది. వైరల్ ఫీవర్, దగ్గు ,జలుబు, ఒళ్లు నొప్పులు వీటి లక్షణాలు. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, గర్భవతులు, వయస్సు మీద పడిన వారికి త్వరగా సోకే అవకాశాలున్నాయి.

English summary
Swine flu has led to five deaths in Hyderabad in the last two weeks. Cases of swine flu are increasing in the city, said Ramesh Reddy, Director of Medical Education of Telangana."Till now, five persons have died due to Swine Flu. Two patients were admitted in Osmania General Hospital and they died while undergoing treatment for Swine Flu. Three other patients were admitted in Gandhi General Hospital and later died. All the government hospitals are now on alert and Swine Flu kits are available with them," Reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X